బడ్జెట్‌పై సామాన్యులు ఏమంటున్నారు?

  • 1 ఫిబ్రవరి 2018
బడ్జెట్

వ్యవసాయ రంగానికి కేంద్రం ఈసారి బడ్జెట్‌లో పెద్దపీట వేసిందని సీఐఐ కన్వీనర్ (ఎమ్ఎఫ్‌జీ సెక్టార్) రాజు అభిప్రాయపడ్డారు.

''విద్య,వైద్య రంగాలకూ ఎక్కువ కేటాయింపులు జరిగాయి. చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు పన్ను మినహాయింపు తగ్గించడం మంచి పరిణామం. పరిశ్రమలకు పెద్ద స్థాయిలో ప్రోత్సాహకాలు ఏమీ లేవు'' అని అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబడ్జెట్‌పై సామాన్యులు ఏమంటున్నారు?

ఈసారి బడ్జెట్ వల్ల ఉద్యోగులకు పెద్దగా ఉపయోగం ఏమీ లేదని ప్రైవేటు ఉద్యోగి స్వాతి అన్నారు. మధ్యతరగతి ప్రజలను ఇది పూర్తిగా నిరాశపరిచిందని చెప్పారు.

బడ్జెట్ చెప్పుకోదగిన విధంగా లేదు. చిన్నతరహా పరిశ్రమలకు ఏ మాత్రం మేలు చేసే అంశాలు ఇందులో కనిపించ లేదని ఎన్ఐఎస్ఈ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రవల్లిక తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)