హైదరాబాద్‌లో పదిలంగా ఉన్న ‘పద్మావత్’ రాతప్రతి

  • 4 ఫిబ్రవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionహైదరాబాద్‌లో పదిలంగా ఉన్న ‘పద్మావత్’ రాతప్రతి

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన పద్మావత్ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ గొడ‌వ‌ల‌తో సంబంధం లేకుండా పద్మావత్ కావ్యం అరుదైన రాత‌ప్ర‌తి హైద‌రాబాద్‌లో ప‌దిలంగా ఉంది.

జామియా నిజామియా లైబ్రరీలోని ఈ ప్ర‌తి 1823లో సేక‌రించారు. ఇందులో 216 పేజీలున్నాయి.

ఈ పుస్త‌కాన్ని న‌ల్ల‌రాతిని పొడిగా చేసి జిగురుతో రూపొందించిన సిరాతో రాసి ప్ర‌త్యేక ప్ర‌క్రియ‌లో ఆర‌బెట్టి త‌యారు చేశారు.

జామియా నిజామియా లైబ్రరీలో ఉన్న 'ప‌ద్మావ‌త్' అవ‌ధి భాష‌లో ప‌ర్షో అర‌బిక్ లిపిలో ఉంది.

ఆధ్యాత్మిక భావాలతో మాలిక్ మ‌హ‌మ్మ‌ద్ జాయ‌సీ పద్మావత్‌ను రచించారు. నిజాం ప్ర‌భుత్వంలో మంత్రిగా చేసిన మ‌హ‌మ్మ‌ద్ అన్వ‌రుల్లా ఫారుఖీ దీన్ని సేక‌రించారు.

ఈ గ్రంథాల‌యంలో ఉర్దూ, అర‌బిక్, పార్శీ భాష‌ల‌కు చెందిన‌ 2,500 చేతిరాత ప్ర‌తులున్నాయి.

ఇందులో 700 ఏళ్ల‌ నాటి పుస్త‌కం, పార్శీలోని భార‌తం కూడా ఉన్నాయి.

'జాయ‌సీ తాను రాసింది జరిగిన చ‌రిత్ర అని చెప్ప‌లేదు. ఒక కథ రాశానని మాత్రమే చెప్పారు' అని మౌలానా అజాద్ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ హెడ్ నసీముద్దీన్ అన్నారు.

జామియా నిజామియా లైబ్రేరియన్ ఫసీయుద్దీన్ నిజామీ బీబీసీతో మాట్లాడుతూ, ''పద్మావత్ మా లైబ్రరీలో ఉన్న ఓ గొప్ప కలెక్షన్. పద్మావత్ 200 ఏళ్ల క్రితం రాసినది.

అదే పేరుతో సినిమా వచ్చిందని మీడియా వార్తలతో తెలిసింది. అయితే సినిమా గురించి నేనేమీ చెప్పలేను. ఆ పుస్తకం మాత్రం మా దగ్గరుంది'' అని తెలిపారు.

రిపోర్టింగ్: బళ్ల సతీశ్, వీడియో: నవీన్ కె.నాయుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు