శ్రీనగర్‌లో ఆసుపత్రిపై తీవ్రవాదుల దాడి, పోలీస్ మృతి

  • 6 ఫిబ్రవరి 2018
శ్రీనగర్ Image copyright TAUSEEF MUSTAFA/AFP/Getty Images

తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులు శ్రీనగర్‌లోని ఒక ఆసుపత్రిపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది ఒకరు మృతి చెందారు.

పోలీసులు ఇవాళ శ్రీనగర్‌లోని పోలీస్ స్టేషన్ నుంచి చికిత్స నిమిత్తం ఒక పాకిస్తానీ తీవ్రవాదిని ఎస్ఎమ్‌హెచ్‌ఎస్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు జమ్మూకాశ్మీర్ డీఐజీ గులామ్ హసన్ భట్ స్థానిక జర్నలిస్ట్ మాజిద్ జహంగీర్‌కు తెలిపారు.

ఆ సందర్భంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు పాకిస్తానీ తీవ్రవాదికి రక్షణగా ఉన్నవారిపై దాడి చేశారని వివరించారు.

Image copyright Getty Images

ఈ దాడిలో నావేద్ జాట్ అనే పాకిస్తాన్ తీవ్రవాది తప్పించుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. జాట్ గత ఏడాది దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పట్టుబడ్డాడు.

దాడి నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)