#Dreamgirls: ‘అబ్బాయిని అయ్యుంటే ఆ ప్రశ్న అడిగేవారా!?’

  • 9 ఫిబ్రవరి 2018
స్వప్నా దత్

‘ఇతరులతో పోలిస్తే సినిమా పరిశ్రమలోకి రావడం నాకు కొంత సులభమే. కానీ నా పైన ఫోకస్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందరూ నాన్నతో నన్ను పోలుస్తూ భూతద్దం పెట్టి చూస్తారు’ అంటున్నారు స్వప్న దత్.

నిర్మాత అశ్వినీదత్ కూతురిగా సినీరంగంలోకి ప్రవేశించిన స్వప్న కూడా సొంతంగా నిర్మాతగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. సినీరంగంలో మహిళలకు ఎదురయ్యే అనుభవాల గురించి ఆమె బీబీసీతో మాట్లాడారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption#Dreamgirls: ‘అబ్బాయిని అయ్యుంటే ఆ ప్రశ్న అడిగేవారు కాదు’

‘చిన్నప్పట్నుంచీ తెలీకుండానే మా నాన్న అశ్వినీదత్ ప్రభావం మాపైన పడింది. అలా సినిమాలపైన ఇష్టం పెరిగింది.

సినిమాల్లోకి సులువుగానే వచ్చే అవకాశం నాకున్న ఇక్కడ నిరూపించుకోవడానికి నేనూ అందరిలానే కష్టపడాలి.

గతంలో మొదట టీవీ కార్యక్రమాలు నిర్మించాలనుకున్నప్పుడు 'నీకు పెళ్లయితే మధ్యలో వెళ్లిపోతావు కదా' అని ఒక వ్యక్తి అడిగారు. అదే నేను అబ్బాయిని అయ్యుంటే ఆ ప్రశ్న ఎదురయ్యేది కాదు.

అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మహిళగా పరిశ్రమలో నాకంటూ ఇతర ఇబ్బందులేమీ ఎదురు కాలేదు.

పరిశ్రమలో అమ్మాయిల్ని చిన్న చూపు చూడటం అనేది నాకు తెలిసీ ఎక్కడా లేదు. ఇంకా చెప్పాలంటే వారికి ఎక్కువ గౌరవం లభిస్తుంది.

మహిళలకు బాధ్యత ఎక్కువ. వాళ్లకో పని చెబితే కచ్చితంగా పూర్తి చేస్తారన్నది నా నమ్మకం. అందుకే మా బృందంలో మహిళలకు ప్రాధాన్యమిస్తా.

ఇప్పుడిప్పుడే ఈ రంగంలో ఆడవాళ్లు ఎక్కువగా వస్తున్నారు. నిస్సంకోచంగా అమ్మాయిలు ఈ రంగంలోకి రావొచ్చు.

నిర్మాతగా ఉన్నప్పుడు అమ్మాయిలకూ అబ్బాయిలకూ ఒకేలాంటి సవాళ్లు ఎదురవుతాయి. జయాపజయాల్ని అమ్మాయిలు కూడా అబ్బాయిలలానే స్వీకరిస్తారు.

విజయాన్ని ఆస్వాదించడం, వైఫల్యానికి బాధపడటం ఎవరికైనా మామూలే. నాక్కూడా అంతే’ అంటూ సినీ పరిశ్రమలో తన అనుభవాల గురించి చెబుతారు స్వప్నా దత్. ఆమె పంచుకున్న మరిన్ని సినీ పరిశ్రమ విశేషాల కోసం పైనున్న వీడియో చూడండి.

(ఈ కథనం ప్రొడ్యూసర్: ప్రతీక్షా గిల్డియాల్; రిపోర్టింగ్: సంగీతం ప్రభాకర్; షూట్/ఎడిట్: నవీన్ కుమార్.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

గోదావరి కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రధాన నిందితుడైన బోటు యజమాని, మరో ఇద్దరి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్: గ్రామ స‌చివాల‌య ఉద్యోగ ప‌రీక్ష‌లపై వివాదం ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది?

ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు?

గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు.. మేట్ 30 ప్రోలో మూవీ కెమెరా

నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్

గోదావరి పడవ ప్ర‌మాదాలు: ఇన్నేళ్ళుగా ప్ర‌భుత్వం తీసుకున్న చర్యలేంటి? వాటి ఫలితాలేమిటి?

వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'