అమ్మవారికి చుడీదార్ వేసిన అర్చకులు

  • 8 ఫిబ్రవరి 2018
అమ్మవారి విగ్రహం

తమిళనాడులోని ఓ గుళ్లో అమ్మవారి విగ్రహానికి పూజారులు చుడీదార్ తొడిగారు. అలా చేసినందుకు ఇద్దరు పూజారులను గుడి యాజమాన్యం సస్సెండ్ చేసింది.

నాగాయ్ జిల్లాలోని మయూరనాథస్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుడికి వెళ్లిన భక్తులు అమ్మవారిని ఆధునిక సల్వార్ కమీజ్‌లో చూసి అవాక్కయ్యారు. ఆ విషయాన్ని ఆలయ యాజమాన్య దృష్టికి తీసుకెళ్లారు.

భక్తుల ఫిర్యాదు ఆధారంగా రాజు, కల్యాణ్ అనే ఇద్దరు పూజారులను యాజమాన్యం సస్పెండ్ చేసింది.

‘ప్రతి గుడికీ కొన్ని నియమాలుంటాయి. ఆ పూజారి గతంలో వేరే గుడిలో పనిచేసేప్పుడు కూడా దేవీ విగ్రహాన్ని ఇలానే అలంకరించేవాడు. ఇప్పుడు కూడా అమ్మవారిని బాలికలా భావించి ఇలా అలంకరించాడు.

భక్తులు ఫిర్యాదు చేశాక యాజమాన్యం ఆ అలంకరణలో పాలు పంచుకున్న ఇద్దరు పూజారులనూ సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వమని వారిని కోరాం’ అని ఆలయ నిర్వహణాధికారి తంబిరన్ చెప్పారు.

ఆ ఇద్దరు పూజారులూ ఆగమ శాస్త్ర నియమాలను ఉల్లంఘించారని ఆలయంలోని మరో పూజారి తెలిపారు. దాన్ని పరిహరించడానికి ప్రత్యేక పూజాలు చేస్తామని అన్నారు.

‘నేను గతంలో వేరే గుడిలో పనిచేసేప్పుడు అమ్మవారిని ఇలానే అలంకరించేవాణ్ణి. అమ్మవారే నా కలలోకి వచ్చి ఇలా అలంకరించమని చెప్పింది. నేను అలానే చేశాను. కానీ నన్ను ఇప్పుడు సస్పెండ్ చేశారు. నేను ఇప్పుడు డిప్రెషన్‌లో ఉన్నాను. దీనిపైన పూర్తి వివరణ యాజమాన్యానికి ఇస్తాను’ అని సస్పెండైన పూజారి రాజు చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు