అద్దాల రైలులో ఆంధ్రా ఊటీకి వెళ్లొద్దామా!

  • పద్మ మీనాక్షి
  • బీబీసీ ప్రతినిధి
వీడియో క్యాప్షన్,

అద్దాల రైలులోంచి అరకు సోయగం చూద్దామా?

ప్రకృతి సోయగానికి పెట్టింది పేరు విశాఖ జిల్లాలోని అరకు లోయ. ఇక్కడి ఎత్తైన పచ్చని కొండలు, బొర్రా గుహలు పర్యాటకులకు మరచిపోలేని అనుభూతిని పంచుతాయి.

ఆంధ్రా ఊటీగా పేరు పొందిన అరకుకు అద్దాల రైలు బోగీలో ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని ఇస్తుంది.

విస్టాడోమ్ పేరుతో ప్రవేశపెట్టిన అద్దాల రైలు పెట్టె పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఈ రైలు 84 వంతెనలు, 58 సొరంగాలను దాటుకుంటూ వెళ్తుంది. వాటిలో కొన్ని సొరంగాలు అర కిలోమీటర్‌కు పైగా పొడవు ఉంటాయి.

ఇందులో ప్రయాణం ఎలా ఉందో మనమూ చూసొద్దామా!

షూట్ ఎడిటర్: త్రినాథ్, బీబీసీ కోసం

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)