ఈ వారం 'చిత్ర భారతం'

పార్లమెంటు ప్రాంగణంలో ‘తెదేపా’ పోతురాజు, ప్రపంచ కప్‌తో యువ క్రీడాకారులు, గ్రామీణ ఒలింపిక్స్‌లో ఒంటె విన్యాసాలు... ఈ వారం ‘చిత్ర భారతం’లో.

పార్లమెంటు బయట పోతురాజు వేషధారణలో నిరసన తెలుపుతున్న తెదేపా చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

పార్లమెంటు బయట పోతురాజు వేషధారణలో నిరసన తెలుపుతున్న తెదేపా చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఆయన ఈ ప్రదర్శన చేపట్టారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

హైదరాబాద్‌లో జరిగిన బ్యూటీ ట్రేడ్ ఎక్స్‌పోలో భాగంగా ఓ బ్యుటీషియన్ ఇలా ఐ లైనర్ పెట్టుకోవడంలోని మెలకువలు నేర్పించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సగం ఎండిన వరి చేనులో దిగాలుగా కూర్చున్న రైతులు. గుజరాత్‌లోని సనద్ తాలూకా లిఖాంబా గ్రామంలోనిదీ దృశ్యం.

ఫొటో సోర్స్, Gujarat Information Department

ఫొటో క్యాప్షన్,

అక్షయ్ కుమార్‌తో కలిసి ప్యాడ్‌మ్యాన్ సినిమా ప్రివ్యూ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ.

ఫొటో సోర్స్, SHAMMI MEHRA/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

లూధియానాలో జరిగిన కిలా రాయ్‌పూర్‌ రూరల్ ఒలింపిక్స్‌లో భాగంగా ఓ ఒంటె నృత్యం.

ఫొటో సోర్స్, NARINDER NANU

ఫొటో క్యాప్షన్,

అమృత్‌సర్ శివార్లలో బంగాళా దుంపల్ని సేకరిస్తున్న ఓ రైతు కూలీ. ల

ఫొటో సోర్స్, Daniel Berehulak/Getty Images

ఫొటో క్యాప్షన్,

ఫిబ్రవరి 3న ముంబైలో జరిగిన క్వీర్ ఆజాదీ మార్చ్‌లో భాగంగా ఎల్‌జీబీటీ సభ్యులతో పాటు కొందరు పౌరులు భారీ ప్రదర్శన చేపట్టారు.

ఫొటో సోర్స్, PUNIT PARANJPE

ఫొటో క్యాప్షన్,

ముంబైలో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో తాము ఇటీవల గెలిచిన ప్రపంచ కప్‌తో భారత అండర్-19 క్రికెట్ జట్టు సభ్యులు.