కోచి షిప్‌యార్డ్‌లో పేలుడు; ఐదుగురి దుర్మరణం

  • 13 ఫిబ్రవరి 2018
కోచి షిప్‌యార్డు Image copyright Getty Images
చిత్రం శీర్షిక కోచి షిప్‌యార్డు

కేరళలోని కోచి షిప్‌యార్డ్‌లో మంగళవారం పేలుడు సంభవించడంతో ఐదుగురు చనిపోయారు.

కోచి నౌకాశ్రయంలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన నౌకలో ఈ పేలుడు చోటుచేసుకొంది. దట్టమైన పొగ వల్ల ఊపిరాడక ఈ ఐదుగురు మృతిచెందారని అధికారులు చెప్పారు.

నౌకలోని మిగతా అందరినీ కాపాడినట్లు బీబీసీ ప్రతినిధి అష్రాఫ్ పడానాకు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు.

కాపాడిన క్షతగాత్రుల్లో ముగ్గురు కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.

పేలుడు సంభవించిన నౌక దేశంలోని అతిపెద్ద చమురు అన్వేషణ సంస్థ 'ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)'కు చెందినది. ఈ నౌక తవ్వకం పనులను చేపడుతుంటుంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోచి షిప్‌యార్డులో దేశంలోని పలు భారీ నౌకలకు మరమ్మతులు జరుగుతుంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు