మానవ సమాజంలో పాశ్చాత్య దేశాలు చీలిక తెచ్చాయి: రౌహాని

రౌహాని

ఇస్లాంలో స‌మైక్య‌త కోసం ఇరాన్ ప‌నిచేస్తుంద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు హ‌స‌న్ రౌహానీ అన్నారు. భారత పర్యటనలో భాగంగా ఆయన గురువారంనాడు హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు, పండితులతో రౌహానీ సమావేశమై మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలివి.

  • మానవ సమాజంలో పాశ్చాత్య దేశాలు చీలిక తెచ్చాయి. తూర్పు దేశాలను పశ్చిమ దేశాలు అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అణచివేతకు గురైనవారికి పోరాటం తప్ప మరో మార్గం లేదు.
  • గతంలో ముస్లిం దేశాలు తమ దగ్గర ఉన్న విజ్ఞానాన్నీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్నీ అన్ని దేశాలకూ పంచాయి. కానీ ఇప్పుడు పశ్చిమ దేశాలు ఇరాన్ లాంటి దేశాలకు టెక్నాలజీ ఇవ్వట్లేదు. మేమేమీ ఉచితంగా దాన్ని అడగడం లేదు.
  • ముస్లిం దేశాల మధ్య సోదర భావం పెంచేందుకు ఇరాన్ దగ్గర ప్రణాళిక ఉంది. ఇరాన్ ప్రపంచ శాంతిని కోరుకుంటుంది. కానీ పశ్చిమ దేశాలు కొన్ని దేశాల మధ్య అంతరాలను సృష్టించాయి.
  • భార‌త‌దేశంలో అన్ని మతస్థులు క‌లిసి ఉంటున్న తీరు అభినందనీయం. ఇదో అవకాశాల గని. యుద్ధం,హింస‌ను ఆప‌డానికి దేశాలకు, ప్రాంతాల‌కు వ్య‌తిరేకంగా మేమూ నిలబడ్డాం.
  • కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సాయం కోరిన ప్రతి వ్యక్తినీ ఆదుకోవాల్సిన బాధ్యత ముస్లింలకు ఉంది.
  • అఫ్గానిస్థాన్, సిరియా, యెమెన్‌లకు ఉన్న సమస్యలను దూరం చేయాలని ఇరాన్ కోరుకుంటోంది. పరస్పర సోదర భావం, సహకారంతో అది సాధ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)