అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ప్రమాదం: గో-కార్ట్ చక్రంలో జుట్టు చిక్కుకుని మహిళ మృతి

గో-కార్ట్‌, అమ్యూజ్‌మెంట్ పార్క్

ఫొటో సోర్స్, Sant Arora/Hindustan Times

ఫొటో క్యాప్షన్,

ప్రమాదం జరిగిన గో-కార్ట్‌ను పరిశీలిస్తున్న పోలీసులు

హర్యానాలో ఓ మహిళ జుట్టు గో-కార్ట్ చక్రంలో చిక్కుకుపోవడంతో మృతి చెందింది.

28 ఏళ్ల పునీత్ కౌర్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు ఈ విషాద ఘటన జరిగింది.

సంఘటన జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

ఈ సంఘటన జరిగిన అనంతరం పింజోర్‌లోని అమ్యూజ్ మెంట్ పార్క్‌లో ఉన్న గో-కార్ట్ ట్రాక్‌ను మూసేశారు.

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

కౌర్ తన భర్తతో కలిసి గో-కార్ట్‌లో ఉండగా ఆమె జుట్టు దాని చక్రంలో చిక్కుకుపోయింది. అయినా గో-కార్ట్ ఆగకపోవడంతో ఆమె తలపై చర్మం మొత్తం ఊడి వచ్చింది.

మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగినప్పుడు కౌర్ హెల్మెట్ కూడా ధరించి ఉందని స్థానికులు చెబుతున్నారు.

అయితే దీనిలో తమ తప్పేమీ లేదని, తగిన భద్రతా చర్యలు తీసుకున్నామని పార్క్ నిర్వాహకులు తెలిపారు.

''ఆ మహిళకు రబ్బర్ బ్యాండ్, హెల్మెట్ ఇచ్చాం'' అని నిర్వాహకులు సుశీల్ కుమార్ తెలిపారు.

అయితే వాటి నాణ్యతపై కౌర్ భర్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)