ప్రాణాలైనా ఇస్తాం, కానీ ఆ ఫ్యాక్టరీ మాత్రం మాకొద్దు: కొంకణ్ ప్రజలు

  • 19 ఫిబ్రవరి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionనిశ్శబ్దం ధ్వనించే చోట పిడికిళ్లు బిగుస్తున్నాయ్. మాటలు అరుపులవుతున్నాయ్

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారత ప్రభుత్వం, చమురు కంపెనీలు ప్రపంచంలోనే అతి పెద్ద పెట్రోకెమికల్ రిఫైనరీని నిర్మించ తలపెట్టాయి.

ఓ వైపు నీలి సముద్రం, మరోవైపు పచ్చటి చెట్లతో అలరారే ఈ కొంకణ్ ప్రాంతంలో ఈ నిర్ణయం అలజడిని రేపింది.

ఈ రిఫైనరీ నిర్మాణం 2022 వరకు పూర్తవుతుందని భావిస్తున్నారు. దీని కోసం రాజపూర్‌లో 15 వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రయత్నం.

Image copyright Getty Images

ఈ రిఫైనరీ పర్యావరణానికి అనుకూలమైందని ప్రభుత్వం చెబుతోంది.

కానీ స్థానిక కొంకణ్ ప్రజలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘చావనైనా చస్తాం కానీ.. మా భూములు మాత్రం ఇవ్వం’’ అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)