త్రిపురలో 74శాతం పోలింగ్ నమోదు

  • 18 ఫిబ్రవరి 2018
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు

ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 నియోజకవర్గాలకుగానూ 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు ఆదివారంనాడు ఎన్నికలు నిర్వహించారు. తక్కిన ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చి 12న ఎన్నికలు నిర్వహిస్తారు.

సాయంత్రం 4గంటల వరకు అందిన సమాచారం మేరకు త్రిపురలో 74% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ల శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఓటింగ్ ప్రక్రియను 3,174 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వి.వి.పి.ఎ.టి.) విధానాన్ని అమలు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా 72% పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను చిత్రీకరించారు.

59 నియోజకవర్గాలకుగానూ మొత్తం 292మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 20మంది మహిళలు ఉన్నారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు