‘మృదంగం ముట్టుకుంటే పూనకం వస్తుంది’
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మృదంగాన్ని తాకితే చాలు ఆమెకు పూనకం వస్తుంది

  • 23 ఫిబ్రవరి 2018

ఆమె మృదంగం వాయిస్తుంటే అక్కడ ఇంకే ధ్వనీ వినిపించదు. మృదంగం వాయిస్తున్నంత సేపు ఆమెకు ఇంకేమీ తెలియదు. ఒక పారవశ్యం ఆమెను కమ్మేస్తుంది, దాన్నే ఆమె ‘మృదంగం పట్టుకోగానే నాకు పూనకం వస్తుంది’ అంటారు.

అరవై ఎనిమిదేళ్ల సుమతి రామ్మోహనరావు కథ ఇది. ఆడపిల్లలు గడప దాటకూడదన్న కాలంలోనే ఆమె మృదంగంపై అంతులేని ఇష్టంతో ఆ విద్య నేర్చుకున్నారు.

1950ల్లో ఆమె మృదంగం నేర్చుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు తనకు 68 ఏళ్ల వయసైనా కూడా మృదంగాన్ని తాకితే 18 ఏళ్ల వయసులోకి మారిపోతానని చెప్తారు.

సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్లు.. త విజయాల వెనుక నా భర్త ఉన్నాడంటూ తన కథ చెప్పుకొచ్చారు సుమతి.

మృదంగం మీద నాట్యం చేస్తోన్న ఆమె చేతి వేళ్లను మనమూ పలకరిద్దాం రండి..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు