నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం

నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం

ప్ర‌పంచ వ్యాప్తంగా స్థిర‌ప‌డ్డ తెలుగు వాళ్ళ‌లో మారిష‌స్‌లో ఉన్న‌వారిది ప్ర‌త్యేక స్థానం. అక్క‌డ 30 వేల‌మందికి పైగా తెలుగువాళ్లు ఉంటారు.

వారంతా 1835 ప్రాంతంలో బ్రిటిష్ వారి ద్వారా అక్క‌డ‌కు వెళ్ళి స్థిర‌ప‌డ్డారు.

క్ర‌మంగా వారు స్థానిక మారిషియ‌న్ క్రియోల్‌ని మాతృ భాష‌గా చేసుకున్నారు.

త‌మ పూర్వీకుల‌ భాష తెలుగును సొంత భాష అని, క్రియోల్ త‌మ మాతృ భాష అని చెప్పుకోవ‌డం వారి ప్ర‌త్యేక‌త‌!

వారు ఇళ్ల‌లో కూడా క్రియోల్ భాషలోనే మాట్లాడుకుంటారు.

అయినా వారికి తెలుగు మీద ఆస‌క్తి, అభిమానం ఉన్నాయి.

రిపోర్టర్: బళ్ల సతీశ్, కెమెరా: నవీన్ కుమార్ కె.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)