లబ్బు..డబ్బు: ఇదీ స్టాక్ మార్కెట్ కథ
షేర్ మార్కెట్‌తో పాటు ఆర్థిక రంగంలో చాలా విషయాలు చాలామందికి అర్థం కావు. వాటిపై సులభంగా అవగాహన కల్పించే సరికొత్త కార్యక్రమం లబ్బు.. డబ్బు.
ఈ వారం షేర్ మార్కెట్ల కథపై దృష్టి సారిద్దాం.
స్టాక్ మార్కెట్ కథ ఇలాగే ఉంటుంది - కభీ కుషీ కభీ గమ్.. ఒకోసారి పైకి, ఒకోసారి కిందికి.
కొన్ని రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లు బేరుమంటున్నాయి. అది అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, ఆసియా కావచ్చు. అమెరికా షేర్ మార్కెట్ గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా పతనమైంది.
ఇప్పటివరకు దౌడు తీస్తున్న షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడానికి కారణమేంటి? దీనికి కారణం ఒకటి కాదు, చాలా ఉన్నాయి.
పదండి, షేర్లు ఎందుకు పడిపోయాయో, మార్కెట్లో ఒడిదుడుకులు ఎందుకొస్తాయో తెలుసుకుందాం.
న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ డౌ జోన్స్ ఒక ఏడాది కాలంలో ఎంత పెరిగిందో, దానికి నాలుగింతలు ఒకే రోజులో మట్టి కొట్టుకుపోయింది. ఈ దెబ్బ అమెరికాకు గట్టిగానే తగిలింది.
ఆ దెబ్బకు అప్పటివరకు ట్రంప్‌ను లైవ్‌లో చూపుతున్న ఛానెళ్లన్నీ ఒక్కసారిగా స్కీన్ మీది నుంచి ట్రంప్‌ను తప్పించి, షేర్ మార్కెట్ కవరేజీ ఇవ్వడం ప్రారంభించాయి.
స్టార్ మార్కెట్ అంటే ఏంటి?
ఇంతకూ ఈ స్టాక్ మార్కెట్ అంటే.. స్టాక్ మార్కెట్ అంటే షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర సెక్యూరిటీల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగే ప్రదేశం.
స్టాక్ మార్కెట్ పరిభాషలో షేర్ అంటే కంపెనీల్లో భాగస్వామ్యం. మీరేవైనా కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తే, మీరు దానిలో భాగస్వాములౌతారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు ఆ షేర్లను స్టాక్ మార్కెట్లో విక్రయించొచ్చు.
బాండ్ రాబడిలో ఎదుగుదల
స్టాక్ మార్కెట్ల పరుగులు ఎప్పుడూ ఉండేవే కానీ, ఒకేసారి ఎందుకిలా కుప్పకూలింది?
మొదటిది, బాండ్ ఈల్డ్‌లో పెరుగుదల అంటే బాండ్ వల్ల రాబడి పెరిగింది అని.
బాండ్ అనేది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటిది. ఇన్వెస్టర్లు నిర్దిష్ట కాలపరిమితికి ఏదైనా కంపెనీకి లేదా ప్రభుత్వానికి రుణం ఇస్తారు. నిజానికి, 2008 ఆర్థిక మాంద్యం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు షేర్ మార్కెట్లు పుంజుకోవడానికి రకరకాలుగా సహాయం చేశాయి. వడ్డీ రేట్లను తగ్గించాయి. దీని వల్ల ప్రజలు ప్రభుత్వ బాండ్ల నుంచి సొమ్మును తీసేసుకుని, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు మళ్లీ పెరగొచ్చనే సంకేతాలు ఇస్తున్నాయి. అందువల్ల చాలా మంది ఇన్వెస్టర్లు మరోసారి షేర్లు అమ్మి, బాండ్ మార్కెట్‌కు తిరిగి వెళుతున్నారు.
ధరల దెబ్బ
ధరల దెబ్బకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు, మన ఇండియాలో అయితే ఆర్బీఐ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచడం అనే ఆయుధాన్ని ఉపయోగించుకుంటాయి.
వడ్డీ రేట్ల ప్రభావం రుణాలపై పడుతుంది, అంటే కంపెనీలకు రుణం తీసుకోవడం భారంగా మారుతుంది.
ఏదైనా వాహనం కొనాలన్నా, ఇల్లు కట్టించాలన్నా ఖర్చు పెరుగుతుంది.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్
బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్నుల్ని ప్రతిపాదించారు.
ఏడాదికి మించిన పెట్టుబడులు, ఒక లక్షకు మించిన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తామన్నారు.
కానీ.. పెద్ద పెద్ద విదేశీ ఇన్వెస్టర్లకు ఈ నిర్ణయం రుచించడం లేదు.
అంతర్జాతీయ ఒత్తిడి
అమెరికాకు తుమ్ము వస్తే, భారతీయ మార్కెట్లకు జలుబు చేస్తుందన్న సామెత ఉంది.
దీనికి కారణం ఎక్కువ మంది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమెరికాకు చెందిన వాళ్లు. ఎక్కువ లాభాల కోసం వాళ్లు తమ పెట్టుబడిని భారతీయ మార్కెట్లలో పెడతారు.
కానీ ఎప్పుడైతే అమెరికాలో పరిస్థితి మెరుగుపడుతుందో, అంటే వడ్డీ రేట్లు పెరుగుతాయో, అప్పుడు వాళ్లు భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు.
మొండి బకాయిలు
మన బ్యాంకులకు ఎన్పీఏలు.. అంటే మొండిబకాయిలు పెద్ద సమస్య.
దేశంలోని అతి పెద్ద బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ తన త్రైమాసిక ఫలితాలలో 2 వేల 416 కోట్ల నష్టాన్ని చూపించింది.
దీన్ని బట్టి చూస్తే బ్యాంకుల పరిస్థితి అంత బాలేదనిపిస్తోంది. అందువల్లే ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ప్రస్తుతం పరిస్థితి అంత బాగా లేదు. మార్కెట్ ఇంత అస్థిరంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్లడం అవసరం.
అయినా, స్టాక్ మార్కెట్లు ఇలాగే పతమౌతాయని, మళ్లీ పుంజుకోలేదని చెప్పలేం.
ఫైనాన్స్ ఫ్లాన్లను రివ్యూ చేసుకోండి
స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మీ ఫైనాన్షియల్ ప్లాన్లను రివ్యూ చేసుకోండి.
మీ డబ్బు చాలా వరకు EMI చెల్లింపులకు పోతుంటే, పెరుగుతున్న రేట్లు దేనిపై, ఎలా ప్రభావం చూపుతాయో ఆలోచించండి.
తీసుకున్న రుణాలను గడువుకు ముందే చెల్లించడం గురించి ఆలోచించండి.
వేర్వేరు రకాల పెట్టుబడులు
మీ పోర్ట్ ఫోలియోలను రివ్యూ చేసుకోండి.
కేవలం ఒకే రకంపై పెట్టుబడి పెట్టే బదులు, రకరకాల వాటిపై ఇన్వెస్ట్ చేయడం గురించి ఆలోచించండి.
భయపడిపోయి, డబ్బులు తీసేయొద్దు
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి వార్తలు రాగానే భయపడిపోయి, మీ సొమ్మును వెనక్కి తీసుకోవడానికి బదులు, నిలబడి ఆలోచించండి. పానిక్ కావద్దు.
మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నపుడు ఒక మంచి ఫైనాన్షియల్ ప్లాన్, పెట్టుబడుల వ్యూహం ఉపయోగపడతాయి.
ఇవి కూడా చదవండి:
- ఏడాది కిందట ఒక్క రూపాయి పెట్టుంటే..!
- ఈ ప్రొఫెసర్.. ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ తీసే మాస్టర్!
- అల్లం, తేనె.. నెక్స్ట్ కండోమ్ ఫ్లేవర్ ఏం రావొచ్చు?
- ఇల్లు కావాలా.. ఇరవై ఏళ్లు ఆగాలి!!
- ఉసెన్ బోల్ట్‌ను తలపిస్తున్న సెన్సెక్స్
- సెన్సెక్స్: 22 రోజుల్లో 1000 పాయింట్లు
- 2017: కంపెనీలపై కాసుల వర్షం
- చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- 'ఆర్థిక వ్యవస్థలో వెలుగు కంటికి కనిపించదా?'
- 2018లో భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది?
- రిచర్డ్ థేలర్: వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలపై రచనలకు నోబెల్
- దేశ ఆర్థిక వృద్ధిపై పాస్‌పోర్ట్‌ల ప్రభావం ఎంత?
- ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? అంబానీ ఆస్తి ఎంత పెరిగింది?
- 2017లో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది?
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
- ఈ ఏడాది మోదీ ఏం చేయబోతున్నారు?
- బడ్జెట్2018: మీరు చదవాల్సిన కథనాలు
- రోడ్ల ప్రాజెక్టు నిరుద్యోగులకు ఊరటనిస్తుందా?
- బిట్కాయిన్లతో బిలియనీర్లయిపోగలమా?
- ‘ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ దొంగతనం’: ‘ఆ కరెన్సీ ఎక్కడికి వెళ్లిందో తెలిసింది’
- 34 వేల కోట్లు.. కొల్లగొట్టారు
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)