పోస్ట్ మార్టం రిపోర్ట్: బాత్ టబ్‌లో స్పృహ కోల్పోయి శ్రీదేవి మృతి

  • 26 ఫిబ్రవరి 2018
శ్రీదేవి Image copyright Reuters

సినీనటి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్టు తేల్చింది.

ఆమె శరీరంలో మద్యం తాలూకు ఆనవాళ్లు ఉన్నట్లు నివేదిక చెబుతోంది.

‘శ్రీదేవి పోస్ట్ మార్టం నివేదికను అధ్యయనం చేశాక, ఆమె తన అపార్ట్‌మెంట్ బాత్ టాబ్‌లో పడి, ఆపై స్పృహ కోల్పోయి చనిపోయారని దుబాయ్ పోలీసులు తెలిపారు’ అంటూ దుబాయ్ ప్రభుత్వానికి చెందిన ‘దుబాయ్ మీడియా ఆఫీస్’ అధికారిక ట్విటర్ హ్యాండిల్ తెలిపింది.

ఈ కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు అది పేర్కొంది.

ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడటం వల్లే శనివారం నాడు ఆమె మృతిచెందినట్లు ఫోరెన్సిక్ నివేదిక చెబుతోంది.

ఫోరెన్సిక్ రిపోర్టును దుబాయ్ పోలీసులు సోమవారం నాడు శ్రీదేవి కుటుంబ సభ్యులకు, ఇండియన్ కాన్సులేట్‌కు విడుదల చేసినట్లు గల్ఫ్ న్యూస్ పేర్కొంది.

తాజాగా విడుదలైన నివేదిక కారణంగా, శ్రీదేవి శరీరం భారత్‌కు రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు గల్ఫ్ న్యూస్ చెబుతోంది

పోస్ట్ మార్టం తుది నివేదిక ద్వారా టాక్సికాలజీ పరీక్షల ఫలితాలు బయటపడే అవకాశం ఉంది.

‘కార్డియాక్ అరెస్ట్’ కారణంగా శ్రీదేవి చనిపోయిందనే ప్రాథమిక నివేదికకూ, ‘బాత్ టబ్‌లో పడి చనిపోయింది’ అనే తాజా నివేదికకూ ఉన్న సంబంధం కూడా పోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా తేలే అవకాశం ఉంది.

మరోపక్క.. ‘ఆరోగ్యకరమైన మహిళలు ప్రమాదవశాత్తూ బాత్‌ టబ్‌లో మునిగిపోతారా?’ అంటూ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption‘వి మిస్ యూ శ్రీదేవి’

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)