శ్రీదేవి భౌతికకాయం భారత్‌కు తీసుకురావడం ఎందుకు ఆలస్యం అవుతోంది?

శ్రీదేవి

ఫొటో సోర్స్, Getty Images

దుబాయ్‌లో శనివారం రాత్రి శ్రీదేవి చనిపోయారు.

మొదట 'కార్డియాక్ అరెస్ట్‌' కారణంగా ఆమె మృతిచెందారని భావించారు.

కానీ ఆమె ప్రమాదవశాత్తూ 'బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లు' ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికల్లో తేలింది.

ఈ నివేదికలు అందిన తర్వాత ఈ కేసు దర్యాప్తును దుబాయ్ పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారు.

ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ విభాగం ఈ కేసును పరిశీలిస్తోంది.

దుబాయ్ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను పరిశీలించారు. ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ విభాగం ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలను పరిశీలించాల్సి ఉంది.

ఈ నివేదికలతో ప్రాసిక్యూషన్‌ విభాగం సంతృప్తి చెందితేనే శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌ తరలించేందుకు అంగీకరిస్తుంది.

'దుబాయ్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌ రెండు వేర్వేరు విభాగాలు. వాటి పని తీరు కూడా భిన్నంగా ఉంటుంది' అని గల్ఫ్ న్యూస్‌ యూఏఈ ఎడిటర్ బాబీ నఖ్వీ బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహమ్మద్ అలీతో చెప్పారు.

ప్రస్తుతానికైతే శ్రీదేవి మృతదేహం మార్చురీలో ఉందని బాబీ నఖ్వీ చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/@SrideviBKapoor

అక్కడి నిబంధనలు, న్యాయపరమైన అంశాల కారణంగా శ్రీదేవి భౌతికకాయం భారత్‌కు తీసుకురావడం మరింత ఆలస్యం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీదేవి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాతే వారిని ఇండియాకు పంపిస్తారు.

ఫిబ్రవరి 24న రాత్రి దుబాయ్‌లో శ్రీదేవి చనిపోయారు.

ఒక వివాహా వేడుకలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి దుబాయ్‌కి వెళ్లారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)