శ్రీదేవికి చివరి వీడ్కోలు!

  • 28 ఫిబ్రవరి 2018
Image copyright EXPANDBLES

శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభమైంది.

Image copyright EXPNADBLES

శ్రీదేవికి చివరిసారి వీడ్కోలు పలికి శ్రద్ధాంజలి ఘటించడం కోసం పలువురు బాలీవుడ్ తారలు, ఆమె అభిమానులు ముంబయిలోని సెలెబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ వద్దకు చేరుకున్నారు.

Image copyright Expandable

శ్రీదేవి భౌతిక కాయాన్ని విలే పార్లేలోని శ్మశానవాటికకు తరలిస్తున్నారు.

Image copyright EXPANDBLE

శ్రీదేవి మద్దతుదారులు రోడ్లపై గుంపులు గుంపులుగా గుమిగూడారు.

Image copyright DIVYAKANT SOLANKI/EPA
చిత్రం శీర్షిక భర్తతో మాధురీ దీక్షిత్

శనివారం నాడు శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందారు. మంగళవారం ఆమె భౌతిక కాయాన్ని ముంబయికి తీసుకొచ్చారు. ప్రజలు ఆమెను చివరిసారి చూడడానికి వీలుగా స్పోర్ట్స్ క్లబ్‌లో ఉంచారు.

Image copyright DIVYAKANT SOLANKI/EPA
చిత్రం శీర్షిక బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్

బుధవారం సాయంత్రం శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభమైంది. 54 ఏళ్ల శ్రీదేవి దుబాయ్‌లోని ఒక హోటల్‌ గదిలో మరణించారు.

చిత్రం శీర్షిక హేమా మాలిని

స్పృహ కోల్పోయాక, బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం వల్ల శ్రీదేవి చనిపోయినట్టు దుబాయ్ పోలీసులు నివేదికలో తెలిపారు.

Image copyright EXPANDABLE/PR
చిత్రం శీర్షిక ఐశ్వర్య రాయ్ బచ్చన్

తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించిన శ్రీదేవి ఒక దశలో సక్సెస్‌కు మారుపేరుగా పేరు పొందారు.

Image copyright EXPANDABLE/PR
చిత్రం శీర్షిక జాక్లీన్ ఫెర్నాండెజ్

యాదృచ్ఛికంగా, సరిగ్గా 21 ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 28 నాడే శ్రీదేవి నటించిన హిందీ చిత్రం 'జుదాయి' (ఎడబాటు) విడుదలైంది.

Image copyright EXPANDABLE/PR
చిత్రం శీర్షిక రవీనా టండన్

ఇవి చదివారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు