పాకిస్తాన్‌లో హోలీ ఎలా చేసుకుంటారంటే..

పాకిస్తాన్‌లో హోలీ ఎలా చేసుకుంటారంటే..

భారతదేశంలో హోలీ పండుగను ఎలా చేసుకుంటారో మనకు తెలిసిందే.

రంగులు చల్లుకుంటూ.. మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతారు. మరి పాకిస్తాన్‌లో హోలీ ఉంటుందా? ఉంటే అక్కడ ఎలా చేసుకుంటారు?

ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పడమెందుకు మీరే చూడండి.

భారతదేశంలో లాగే పాకిస్తాన్‌లో కూడా తరతరాలుగా హోలీ సంబరాలు జరుగుతూనే ఉన్నాయి.

కరాచిలోని శ్రీస్వామి నారాయణ్ మందిరంలో హోలీ సందర్భంగా కాముడి దహనం చేశారు.

ఆ తరువాత సంతోషంతో రంగులు చల్లుకోవడం ప్రారంభించారు.

ఆడుతూ పాడుతూ రంగులు పూసుకుంటూ సంబరాల్లో మునిగితేలారు.

పాకిస్తాన్‌లో దాదాపు 30 లక్షల మంది హిందువులు ఉన్నారు. వీరంతా స్నేహానికి, ప్రేమకు ప్రతీకగా ఈ రంగుల పండుగ జరుపుకొంటారు.

ఈ పండుగను చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చూస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)