కేవీపీవై.. వైజ్ఞానిక పరిశోధకులకు అండ
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పరిశోధనపై ఆసక్తి ఉందా..! ఈ 'స్కాలర్‌షిప్’మీ కోసమే

  • 4 మార్చి 2018

విద్యార్థి దశలోనే సైన్స్ పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు, ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విభాగం అందించే స్కాలర్‌షిప్ 'కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన'. దీన్నే సంక్షిప్తంగా 'కేవీపీవై' అంటారు.

సైన్సులో ప్రతిభ చూపే విద్యార్థులను గుర్తించి పరిశోధనల దిశగా ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం.

దీనికోసం రాత పరీక్ష ద్వారా అర్హులను గుర్తిస్తారు. ఎంపికైన వారికి బ్యాచిలర్ డిగ్రీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు ఉపకారవేతనం అందుతుంది.

ఈ ఉపకారవేతనానికి ఎంపికైన వారికి తొలి మూడేళ్లు, అంటే డిగ్రీ స్థాయిలో నెలకు రూ.5 వేలు స్టైపండ్ ఇస్తారు. దీనికి అదనంగా వార్షిక గ్రాంటు రూ.20 వేలు ఇస్తారు.

చివరి రెండేళ్లు, అంటే పీజీ స్థాయిలో నెలకు రూ.8 వేల చొప్పున స్టైపండ్ ఇస్తూ వార్షిక గ్రాంటు రూ.28 వేలు ఇస్తారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు