సామాజిక సమస్యలపై ‘ఉరిమి’న ఉమారాణి
ఉమారాణి జానపద కళాకారిణి. సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉరిమిని ఎక్కువగా మగవాళ్లే వాయిస్తారు. ఈ సంప్రదాయాన్ని ఎదిరించి నిలిచారామె.
జానపద కళ నేర్చుకుంటానని పట్టుబట్టినందుకు ఉమారాణిని తల్లిదండ్రులు ఇంట్లోంచి పంపించేశారు.
హెచ్ఐవీ రాకుండా మగాళ్లు కండోమ్ వాడాలంటూ 17ఏళ్ల వయసులో ఆమె చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.
లాకప్ డెత్లు, గృహహింస, చదువుకునే హక్కు వంటి సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛంద సంస్థల సహాయంతో తమిళనాడు వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు.
ఉమారాణికి సొంతగా కళాకారుల బృందం ఉంది. 25 రకాల కళారూపాలను వీరి ప్రదర్శిస్తారు.
నెలసరి సమయంలో మహిళలు డ్రమ్స్ వాయించడం సరికాదని, డప్పు, డోలు వంటివి మహిళలు వాయించడం ఏమిటన్న దురభిప్రాయాలపై ఉమారాణి పోరాడాల్సి వచ్చింది.
ఎవరు ఏమన్నా.. తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నత శిఖరాలకు చేరారు..ఉమారాణి. ఉమారాణి తల్లిదండ్రులు కూడా ఆమెను అర్థం చేసుకున్నారు.
ప్రస్తుతం ఆమె తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా తల్లిదండ్రులతోనే ఉంటోంది.
మీరివి చదివారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)