షార్క్‌లను రక్షించటం ఎలా?

  • 5 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionదినేశ్ గోస్వామి కృషి ఫలితంగా ఇప్పుడు గుజరాత్‌లో వేల్స్ షార్క్‌ల వేట ఆగపోయింది

గుజరాత్‌లోని మత్స్యకారులు గతంలో డబ్బు కోసం వేల్స్ షార్క్‌లను ఇష్టానుసారం చంపేసేవారు. 20 ఏళ్లపాటు అక్కడ ఇదే పరిస్థితి కొనసాగింది.

అయితే, దినేశ్ గోస్వామి వచ్చాక పరిస్థితి మారింది. వేల్స్ షార్క్‌లను రక్షించేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఇప్పుడు మత్స్యకారులు కూడా ఆయనకు సహకరిస్తున్నారు.

సొర చేపల రక్షకుడిగా సేవలందిస్తున్న ఆయనపై బీబీసీ ప్రతినిధి అమిర్ పీర్‌జాదా అందిస్తున్న కథనం.

పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణ కోసం దినేశ్ గోస్వామి కృషి చేస్తున్నారు. గుజరాత్‌లో వేల్స్ షార్క్‌లను కాపాడేందుకు ప్రకృతి నేచర్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు.

సముద్రంలో ఎవరి వలకైనా వేల్స్ షార్క్‌లు చిక్కితే ఈయన బృందం అక్కడికి వెళ్లి దాన్ని రక్షిస్తుంది.

‘వలలో వేల్స్ షార్క్ చిక్కుకున్నట్లు తెలిస్తే అక్కడికి పడవలో వెళ్తాం. అది ఆడా? మగా? వలలో ఎలా చిక్కుకుందో తెలుసుకుంటాం. దానికి సబంధించిన వివరాలన్నీ నమోదు చేస్తాం. జీపీఎస్ ప్రాంతాన్ని కూడా తీసుకుంటాం. తర్వాత జాగ్రత్తగా దాన్ని వలలోంచి తీసి సముద్రంలో వదిలేస్తాం’ అని దినేశ్ గోస్వామి బీబీసీకి వివరించారు.

  • రిపోర్టర్: అర్చనా పుష్పేంద్ర
  • ప్రొడ్యూసర్: అమీర్ పీర్జాదా
  • కెమెరా: పవన్ జైస్వాల్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)