తొలి అడుగు: తెదేపా కేంద్ర మంత్రుల రాజీనామా

  • 7 మార్చి 2018
చంద్రబాబు Image copyright MANJUNATH KIRAN

ప్రత్యేక హోదా ఆందోళనల నేపథ్యంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు.. సుజనా చౌదరిలను రాజీనామా చేయాల్సిందిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు.

తాము ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని స్పష్టం చేశారు.

తాము కేబినెట్‌లో ఉన్నా.. రాష్ట్రానికి న్యాయం జరగడం లేదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాతావరణం వేడెక్కింది. బుధవారం ఉదయం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై మాట్లాడగా.. సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఇదే అంశంపై మాట్లాడారు. జైట్లీ ప్రత్యేక హోదా అనేదే లేదని చెప్పిన తర్వాత రాష్ట్రంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న ఎంపీలు, రాష్ట్ర మంత్రులు తెదేపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు.

ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు ప్రెస్ మీట్ కూడా మొదట 7.30కని.. తర్వాత ఎనిమిదింటికని వాయిదాపడుతూ వచ్చింది. చివరకు పదిన్నర తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు.

తప్ప తాగి.. ఊబర్ ఎక్కి.. లక్ష రూపాయలు బిల్లు కట్టాడు..!

Image copyright twitter/YSRCParty
చిత్రం శీర్షిక ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆందోళన చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

గత కొంతకాలంగా.. ముఖ్యంగా శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాక ప్రత్యేక హోదాపై టీడీపీ స్వరం పెంచింది.

అటు పార్లమెంట్‌లో ఎంపీలు ఆందోళనలు.. నిరసన ప్రదర్శనలు చేశారు.

రాష్ట్రంలోనూ అధికార టీడీపీ సహా విపక్షాలు కూడా బంద్‌.. ప్రదర్శనలు చేపట్టాయి.

ఇక చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ జరుగుతున్నపుడు బయట.. కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించొచ్చని.. టీడీపీ బీజేపీతో పొత్తును కటీఫ్ చేసుకుంటుందనీ వదంతులు వ్యాపించాయి.

అయితే వీటన్నింటికీ చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు.

ఈ అంశంపై మరిన్ని అప్‌డేట్‌ల కోసం బీబీసీ న్యూస్ తెలుగును చూస్తూ ఉండండి

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు