ఏపీ బడ్జెట్‌లో ఏముంది?.. ఇతర రాష్ట్రాల బడ్జెట్లు ఎలా ఉన్నాయ్?

 • 8 మార్చి 2018
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు Image copyright www.apfinance.gov.in
చిత్రం శీర్షిక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.1,91,063.61 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయంగా రూ.1,50,270 కోట్లుగా పేర్కొన్నారు.

విభజన కారణంగా రాజధానిని, ఆదాయాన్ని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం అందడం లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తన ప్రసంగంలో ఆరోపించారు.

ప్రధాన రంగాలకు బడ్జెట్ కేటాయింపులు

 • వ్యవసాయం: రూ.12,355 కోట్లు
 • విద్య(సాంకేతిక విద్యతో కలిపి): రూ.25,003 కోట్లు
 • ఇరిగేషన్: రూ.16,978 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి: రూ.20,851 కోట్లు
 • పరిశ్రమలు: రూ.3,074.87 కోట్లు
 • బీసీ సంక్షేమం: రూ.12,200 కోట్లు
 • పోలవరం ప్రాజెక్టు: రూ.9,000 కోట్లు
 • రైతు రుణమాఫీ: రూ.4,100 కోట్లు
 • ఎన్టీఆర్ పింఛన్లు: రూ.5,000 కోట్లు

బడ్జెట్2018: తెలుగు రాష్ట్రాలకు ఏమిచ్చారు?

బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే!

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బిహార్ సీఎం నితీశ్ కుమార్

మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే 12 రాష్ట్రాలు బడ్జెట్లు ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల బడ్జెట్లను పరిశీలిద్దాం. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పశ్చిమ్‌బంగ, జమ్ముకశ్మీర్, గుజరాత్‌లు ప్రధాన రంగాల్లో దేనికెంత కేటాయించాయో చూద్దాం.

1) బిహార్:

2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టిన తేదీ: ఫిబ్రవరి 27

* జీఎస్‌డీపీ అంచనా: రూ.5,15,634 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 11 శాతం ఎక్కువ.

* వ్యయం అంచనా: రూ.1,76,990 కోట్లు

* రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.1,60,735 కోట్లు

దేనికెంత..

 • విద్య: రూ.32,126 కోట్లు
 • ఆరోగ్యం: రూ.7,794 కోట్లు
 • పింఛన్లు: రూ.15,829 కోట్లు
 • రహదారులు: రూ.6,889 కోట్లు
 • ఇంధనరంగం: రూ.10,258 కోట్లు
 • రూరల్ వర్క్స్: రూ.10,509 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి: రూ.15,471 కోట్లు
 • పంచాయతీరాజ్: రూ.9,955 కోట్లు
 • వ్యవసాయం: 2017-22 కాలానికి వ్యవసాయానికి ఒక రోడ్ మ్యాప్ తయారుచేశారు. దీనికి మొత్తం కాలానికి కేటాయింపులు రూ.1.54 లక్షల కోట్లు
 • ఎస్సీ, ఎస్టీ సంక్షేమం: రూ.16,734 కోట్లు 

కేంద్ర బడ్జెట్: ‘ఓట్ల కోసం కలల వల’

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 16న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది

2) ఉత్తరప్రదేశ్

బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 16, 2018

* జీఎస్‌డీపీ అంచనా: రూ.14,88,934 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 8 శాతం ఎక్కువ.

* వ్యయం అంచనా: రూ.4,28,385 కోట్లు

* రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.3,53,784 కోట్లు

దేనికెంత..

 • విద్య: రూ.63,213 కోట్లు
 • ఆరోగ్యం: రూ.20,157 కోట్లు
 • ఇరిగేషన్: రూ.14,291 కోట్లు
 • పబ్లిక్ వర్క్స్: రూ.22,224 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి: రూ.19,733 కోట్లు
 • పంచాయతీరాజ్: రూ.14,228 కోట్లు
 • వ్యవసాయం: 11,589 కోట్లు
 • పట్టణాభివృద్ధి: రూ.13,484 కోట్లు 

గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ఏమిచ్చింది?

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్

3) ఛత్తీస్‌గఢ్

బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 10, 2018

* జీఎస్‌డీపీ అంచనా: రూ.3,25,644 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే11.7 శాతం ఎక్కువ.

* వ్యయం అంచనా: రూ.83,179 కోట్లు

* రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.73,782 కోట్లు

దేనికెంత..

 • పాఠశాల విద్య: రూ.3,180 కోట్లు
 • వ్యవసాయం: 2,366 కోట్లు
 • పంచాయతీలు, గ్రామీణాభివృద్ధి: రూ.7,903 కోట్లు
 • రహదారులు, వంతెనలు: రూ.3,150 కోట్లు
 • పట్టణాభివృద్ధి: రూ.2,471 కోట్లు 
 • గిరిజన ఉప ప్రణాళిక: రూ.15,232 కోట్లు
 • ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.5,623 కోట్లు

'రక్షణ బడ్జెట్‌లో రెండు శాతం శానిటరీ ప్యాడ్లకు ఖర్చు పెట్టాలి'

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

4) కేరళ బడ్జెట్

బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 2, 2018

* జీఎస్‌డీపీ అంచనా: రూ.7,72,894 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే12.6 శాతం ఎక్కువ.

* వ్యయం అంచనా: రూ.1,27,093 కోట్లు

* రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.1,03,136 కోట్లు

దేనికెంత..

 • విద్య, క్రీడలు: రూ.20,889 కోట్లు
 • వ్యవసాయం: రూ.3,979 కోట్లు
 • ఆరోగ్యం: రూ.6,727 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి: రూ.3,871 కోట్లు
 • సామాజికభద్రత, సంక్షేమం: రూ.4,677 కోట్లు
 • స్థానికసంస్థలకు: రూ.9,129 కోట్లు
 • ఎస్సీ, ఎస్టీ సంక్షేమం: రూ.3,234 కోట్లు

బీజేపీ ఫేస్‌బుక్ పేజీలో ఏపీ నెటిజన్ల నిరసనలు

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

5) పశ్చిమబెంగాల్ బడ్జెట్

బడ్జెట్ తేదీ: జనవరి 31, 2018

* జీఎస్‌డీపీ అంచనా: రూ.10,48,678 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 15 శాతం ఎక్కువ.

* వ్యయం అంచనా: రూ.1,95,829 కోట్లు

* రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.1,48,834 కోట్లు

ప్రత్యేకత: రెవెన్యూ లోటు అస్సలు లేదు. ద్రవ్యలోటు మాత్రం రూ.23,805 కోట్లు ఉంది.

దేనికెంత..

 • పాఠశాల విద్య: రూ.24,722 కోట్లు
 • వ్యవసాయం: రూ.3,979 కోట్లు
 • ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: రూ.8,770 కోట్లు
 • పట్టణాభివృద్ధి: రూ.10,013 కోట్లు
 • పంచాయతీలు, గ్రామీణాభివృద్ధి: రూ.19,063 కోట్లు
 • స్త్రీ, శిశు, సాంఘిక సంక్షేమం: రూ.5,183 కోట్లు
 • పబ్లిక్ వర్క్స్: రూ.5,008 కోట్లు
 • ఆహార సరఫరా: రూ.8,037 కోట్లు

కేంద్ర బడ్జెట్లో మీ జేబుకు చిల్లు వేసే అంశాలు.. ఊరట కలిగించేవి

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ

6) గుజరాత్ బడ్జెట్

బడ్జెట్ తేదీ: ఫిబ్రవరి 20, 2018

* జీఎస్‌డీపీ అంచనా: రూ.14,96,013 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 13.3 శాతం ఎక్కువ.

* వ్యయం అంచనా: రూ.1,81,945 కోట్లు

* రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.1,40,927 కోట్లు

దేనికెంత..

 • విద్య: రూ.25,270 కోట్లు
 • ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: రూ.8,172 కోట్లు
 • వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.5,990 కోట్లు
 • పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాణం: రూ.10,849 కోట్లు
 • పంచాయతీలు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణం: రూ.5,387 కోట్లు
 • నర్మద జలవనరులు, నీటి సరఫరా: రూ. 12,300 కోట్లు
 • రహదారులు, భవనాలు: రూ.9,012 కోట్లు
 • గిరిజన సంక్షేమం: రూ.13,278 కోట్లు
 • సామాజిక న్యాయం, సాధికారత: రూ. 7,204 కోట్లు

మొట్టమొదటి కేంద్ర బడ్జెట్: 'ఆకలి తీర్చుకునేందుకు విదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేం'

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

7) జమ్ముకశ్మీర్ బడ్జెట్

బడ్జెట్ తేదీ: జనవరి 11, 2018

* జీఎస్‌డీపీ అంచనా: రూ.1,16,637 కోట్లు (ఇది 2017-18 సవరించిన బడ్జెట్ అంచనాల కంటే 6.9 శాతం ఎక్కువ.

* వ్యయం అంచనా: రూ.80,313 కోట్లు

* రాబడి అంచనా(అప్పులు కాకుండా) రూ.71,180 కోట్లు

ప్రత్యేకం: జమ్ముకశ్మీర్‌లోని అన్ని కార్మిక చట్టాలు అమలు చేస్తూ వ్యవసాయ, గృహ కార్మికుల మినహా అన్ని రంగాల కార్మికుల కోసం 'ఉమ్మడి ఉద్యోగ స్మృతి' రూపొందిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు.

దేనికెంత..

 • విద్య: రూ.7,735 కోట్లు
 • ఆరోగ్యం, వైద్య విద్య: రూ.3,529 కోట్లు
 • విద్యుత్: రూ.13,053 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి: రూ.3,121 కోట్లు
 • గృహనిర్మాణం: రూ. 2,201 కోట్లు

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)