ప్రత్యేక హోదా: తాజా పరిణామాలు

  • 8 మార్చి 2018
అశోక్ గజపతిరాజు రాజీనామా లేఖ
చిత్రం శీర్షిక అశోక్ గజపతిరాజు రాజీనామా లేఖ

కేంద్ర.. రాష్ర్ట మంత్రుల రాజీనామాలతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. బుధవారం రాత్రి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంలో ఉన్న తమ ఇద్దరు మంత్రులను రాజీనామా చేయించాలన్న నిర్ణయానికి పర్యవసానంగా గురువారం పలు కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి.

భాజపా మంత్రులు - కామినేని శ్రీనివాస్,మాణిక్యాలరావు ముఖ్యమంత్రిని కలిశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందే మంత్రులు ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు.

ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిన కామినేని శ్రీనివాస్ రాజీనామా పత్రంలో ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకానికి కృతఙ్ఞతలు తెలుపుతూ, "రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రజలలో ఆందోళన రేపుతున్నాయి. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ అభివృద్ధి పథంలో ఆలోచించే ప్రభుత్వాలు ఉన్నా.. తాజాగా తెరపైకి వచ్చిన భేదాలు బాధాకరం." అని రాశారు.

దేవాదాయశాఖ మంత్రిగా పని చేసిన మాణిక్యాల రావు తన రాజీనామా పత్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల మూలాన రాజీనామా చేయవలసి రావటం బాధగా ఉందని తెలిపారు. వీరు రాజీనామా చేసే ముందు ముఖ్యమంత్రిని కలిశారని తెలుస్తోంది.

Image copyright drksrinivas.bjp/tdp.ncbn.official/PMRBJP/facebook

అదే విషయం వివరిస్తూ బీబీసీ తెలుగు తో మాట్లాడిన మాణిక్యాల రావు" ముఖ్యమంత్రి తో మాట్లాడాం. అప్పుడు సీఎం.. కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామా చేసినందు వల్ల మీరు ఇచ్చిన రాజీనామాలను కూడా అంగీకరిస్తాం.. అని చెప్పారు..’’ అని వివరించారు.

ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది.

అనంతరం ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారులతో సమావేశం అయ్యారు.

చిత్రం శీర్షిక సుజనా చౌదరి రాజీనామా లేఖ

రేపు అసెంబ్లీ సమావేశాలకు సెలవు కావటంతో తరువాయి వ్యూహం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.

దిల్లీలో గురువారం సాయంత్రం కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ప్రధానికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు