ప్రియా ప్రకాశ్ వారియర్ బీబీసీతో ఏమందంటే?
ప్రియా ప్రకాశ్ వారియర్ బీబీసీతో ఏమందంటే?
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు.
'ఒరు అదర లవ్' అనే మలయాళ సినిమాలోని 'మాణిక్య మలరయ పూవి' పాటలో ఆమె పలికించిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
కన్నుకొట్టి ప్రపంచమంతా తన వైపు తిప్పుకునేలా చేసింది.
తన వీడియో వైరల్ అవడంపై ప్రియా వారియర్ బీబీసీతో మాట్లాడారు.
సోషల్ మీడియా వల్లే తన వీడియో ప్రపంచమంతా చూస్తుందోని ప్రియా సంతోషం వ్యక్తం చేశారు. తమ సినీ పరిశ్రమ ఎదుగుదలకు ఈ ప్రచారం తోడ్పడుతుందని ఆమె అన్నారు.
అయితే, ఈ ప్రియా వారియర్ వీడియో తమ మతం మనోభావాలను దెబ్బతీశాయని కొన్ని ముస్లిం వర్గాలు ఈ సినిమా నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే, సుప్రీం కోర్టు ఆ కేసును కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)