'నేను గ్రామానికి సర్పంచి, మా కుటుంబాన్ని బహిష్కరించారు'
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

'నేను గ్రామానికి సర్పంచి, మా కుటుంబాన్ని బహిష్కరించారు'

  • 12 మార్చి 2018

నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని బుస్సాపూర్ గ్రామ సర్పంచిగా 2013లో మమత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ, ఇప్పుడు తన కుటుంబాన్ని గ్రామస్థులు వేలివేశారని ఆమె ఆరోపిస్తున్నారు.

"మా ఇంటికి పాలు సరఫరా చేయకూడదని, వేడుకలకు మమ్మల్ని పిలవొద్దని, కలవకూడదని, మాతో పాటు ప్రయాణించకూడదని గ్రామంలోని గురిడి కాపు సంఘం సభ్యులు నిర్ణయించారు" అని మమత అంటున్నారు.

బుస్సాపూర్ గ్రామంలోని 11 ఎకరాల భూమిలో దళిత కుటుంబాలు పశువులను మేపుకుంటున్నాయి.

కానీ ఈ భూమి తమదని గురిడి కాపు సంఘం సభ్యులు అంటున్నారు.

దళితుల నుంచి ఆ భూమిని తమ తాతలు కొనుగోలు చేశారని, కానీ దానికి సంబంధించిన పట్టాలు బదిలీ కాలేదని గురిడి కాపు సంఘం సభ్యులు చెబుతున్నారు.

‘‘ఈ భూమిని తమకు బదిలీ చేయాలంటూ’’ గురిడి కాపు సంఘ సభ్యులు భర్త మీద ఒత్తిడి తెస్తున్నారని మమత తెలిపారు.

"నా భర్త మీద ఒత్తిడి తెచ్చి, తర్వాత మిగిలిన వారిని కూడా ఒప్పించాలని చూస్తున్నారు" అని అన్నారు.

దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించారు.

దాంతో ముగ్గురు గురిడి కాపు సంఘ సభ్యులపై ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అఫ్ అట్రాసిటీస్ చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

అయితే, మమత చేస్తున్న బహిష్కరణ ఆరోపణల్లో నిజం లేదని ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి అన్నారు.

ఈ కేసుని విచారిస్తున్నామని పరిశీలన పూర్తయ్యాక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఏసీపీ కె.శివకుమార్ చెప్పారు.

ఇవి కూడా చూడండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

సంబంధిత అంశాలు