రూ.1,74,453 కోట్లతో తెలంగాణ బడ్జెట్

  • 15 మార్చి 2018
బడ్జెట్ పత్రాలతో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, స్పీకర్ మధుసూదనాచారి Image copyright facebook/EatalaRajendar

తెలంగాణలో ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తన పూర్తిస్థాయి చివరి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 2018-19 సంవత్సరానికి మొత్తంగా రూ.1,74,453.84 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

కొత్త రాష్ట్రం తెలంగాణలో వరుసగా అయిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కడంపై ఈటల సంతోషం వ్యక్తంచేశారు.

గత ఏడాది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ) వృద్ధి రేటు తొలిసారి రెండంకెలు దాటిందని.. ఈసారి అంతకంటే అధికంగా 10.4 శాతం ఉండొచ్చని అంచనా వేశారు.

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమల్లోకి రావడం వంటి పరిణామాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ జీడీపీ వృద్ధి రేటుతో పోల్చితే తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు మెరుగ్గా ఉందని తెలిపారు.

బడ్జెట్లో గర్భిణుల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ. 561 కోట్లు కేటాయించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ. 2,643 కోట్లు కేటాయించారు.

తెలంగాణ బడ్జెట్ స్వరూపం

మొత్తం రాష్ర్ట బడ్జెట్: రూ. 1,74,453.84 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ. 1,25,454 కోట్లు

ఆదాయం: రూ. 73,751 కోట్లు

రెవెన్యూ మిగులు అంచనా: రూ. 5,520 కోట్లు

ద్రవ్య లోటు అంచనా: రూ. 29,077 కోట్లు

వృద్ధి రేటు: 10.4

Image copyright Getty Images

కొన్ని ప్రధాన రంగాలకు కేటాయింపులు ఇలా..

విద్య(సాంకేతిక విద్యతో కలిపి): రూ. 13,370 కోట్లు

వైద్యం: రూ.7,375 కోట్లు

వ్యవసాయం: రూ.13,149 కోట్లు

(రైతు బీమా, పెట్టుబడి మద్దతు పథకం, యాంత్రీకరణ వంటివన్నీ కలిపి)

విద్యుత్: రూ. 5,650 కోట్లు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ. 15,563 కోట్లు

పురపాలన, పట్టణాభివృద్ధి: రూ. 8,251 కోట్లు

ఇరిగేషన్: రూ.25 వేల కోట్లు

ఎస్సీల సంక్షేమం: రూ. 12,709 కోట్లు

ఎస్సీ ప్రగతి నిధి: రూ. 16,453 కోట్లు

ఎస్టీల సంక్షేమం: రూ. 8,063 కోట్లు

ఎస్టీ ప్రగతి నిధి: రూ. 9,693 కోట్లు

బీసీల సంక్షేమం: రూ. 5,920 కోట్లు

ఎంబీసీ కార్పొరేషన్: రూ.1000 కోట్లు

మైనార్టీల సంక్షేమం: రూ. 2,500 కోట్లు

Image copyright www.apfinance.gov.in
చిత్రం శీర్షిక ఏపీ బడ్జెట్ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ స్వరూపం

కాగా గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ మొత్తం రూ.1,91,063.61 కోట్లు.

బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. ''విభజన కారణంగా రాజధానిని, ఆదాయాన్ని కోల్పోయింది. రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం అందడం లేదు' అన్నారు.

మొత్తం బడ్జెట్‌: రూ.1,91,063 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ.1,50,270కోట్లు

మూలధన వ్యయం:రూ.28,671 కోట్లు

ఆర్థిక లోటు అంచనా:రూ.24,205 కోట్లు

వృద్ధిరేటు : 10.96శాతం

Image copyright Getty Images

ప్రధాన రంగాలకు బడ్జెట్ కేటాయింపులు

విద్య(సాంకేతిక విద్యతో కలిపి): రూ.25,003 కోట్లు

ఇరిగేషన్: రూ.16,978 కోట్లు

వ్యవసాయం: రూ.12,355 కోట్లు

గ్రామీణాభివృద్ధి: రూ.20,851 కోట్లు

పరిశ్రమలు: రూ.3,074.87 కోట్లు

బీసీ సంక్షేమం: రూ.12,200 కోట్లు

పోలవరం ప్రాజెక్టు: రూ.9,000 కోట్లు

రైతు రుణమాఫీ: రూ.4,100 కోట్లు

ఎన్టీఆర్ పింఛన్లు: రూ.5,000 కోట్లు

విద్యుత్:రూ.5,052 కోట్లు

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)