#BBCShe: ఆమె చెబుతుంది.. ప్రపంచం వింటుంది
#BBCShe... మీ ఆలోచనలే మా కథనాలు. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని వివిధ నగరాలు, పట్టణాలకు వెళ్లి మహిళలతో మాట్లాడుతాం.
మీరు చేయాల్సిందంతా.. మా నుంచి ఎలాంటి కథనాలు కోరుకుంటున్నారు? మేం ఇవ్వలేకపోతున్న కథనాలు ఏంటి? చెప్పడమే.
మీ ఆలోచనలు.. మీకు స్ఫూర్తినిస్తున్న అంశాలు.. మిమ్మల్ని బాధిస్తున్నవి.. సంతోషంలో ముంచెత్తుతున్నవి.. అన్నీ మీ నుంచి వింటాం.
దీనికి చేయాల్సిందంతా సింపుల్... మేమేం చేయాలో మీరు చెప్పండి. మీ ఆలోచనను మేం కథనంగా మలుస్తాం.
మా ఆడియన్స్‌ను కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు మేం ఎంచుకున్న మార్గమిది. ఇందులో భాగంగా మీకు సంబంధించిన.. మీ హృదయాలకు దగ్గరగా ఉన్న అంశాలకు కథన రూపమిస్తాం.
ఇందులో భాగంగా మేం బిహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర వెళ్తున్నాం. మా వెబ్సైట్, ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో మా ప్రయాణాన్ని ఫాలో అవ్వండి.
మీరూ మాకు ఆలోచనలు పంపించాలనుకుంటే... #BBCShe హ్యాష్ ట్యాగ్‌తో మాకు ట్వీట్ చేయండి. లేదంటే ఫేస్బుక్లో మాకు మెసేజ్ పంపించండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)