ఈ విగ్రహాలు ఆనాటి కమ్యూనిజానికి ఆనవాళ్లు..

ఈ విగ్రహాలు ఆనాటి కమ్యూనిజానికి ఆనవాళ్లు..

దేశ‌వ్యాప్తంగా విగ్ర‌హాల కూల్చివేత‌పై చర్చ జ‌రుగుతోన్న వేళ విజ‌య‌వాడలో అరుదైన కమ్యూనిస్టు విగ్ర‌హాలు ప‌దిలంగా ఉన్నాయి. క‌మ్యూనిస్టుల‌కు ఒక‌ప్పుడు కంచుకోట‌గా వెలిగిన విజ‌య‌వాడ‌లో నేటికీ ఆ పార్టీవారి విగ్ర‌హాలు, జెండా స్తంభాలు, ఆన‌వాళ్ళు చెక్కుచెద‌ర‌కుండా ఉన్నాయి.

విజ‌య‌వాడ‌కూ క‌మ్యూనిజంకూ ఒక అవినాభావ సంబంధం ఉంది. భార‌త‌దేశంలో క‌మ్యూనిస్టు సిద్ధాంతం పురుడుపోసుకున్న‌ప్ప‌టి నుంచి, అందులో ఉన్న అన్ని భావజాలాలూ, శాఖ‌లూ, పాయలకు అన్నిటికీ వేదికగా ఉండేది విజ‌య‌వాడ‌.

తెలంగాణ సాయుధ పోరాట స‌మ‌యంలో విజ‌య‌వాడ ఆశ్రయ కేంద్రంగా ఉపయోగపడింది.

(రిపోర్టింగ్: బళ్ల సతీష్, వీడియో: నవీన్ కుమార్)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)