దిల్లీ నడివీధిలో చెస్ ఆడే ఈ శరణార్థికి ‘చెక్’ పెట్టగలరా!

  • 19 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅఫ్గానిస్తాన్ నుంచి వచ్చి సరదాగా చెస్ ఆడుతూ!

రిపోర్టింగ్: ప్రగ్యా మానవ్, షూట్/ఎడిట్: దెబలీన్ రాయ్

అబ్దుల్ సామద్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ వచ్చిన శరణార్థి. తనతో పాటుగా తాను ఎంతగానో ఇష్టపడే ఓ చెస్ బోర్డును కూడా వెంట తెచ్చుకున్నారు.

సాధారణంగా ఇతర దేశాలకు వలస వెళ్లినపుడు అక్కడి యాస, భాష, వేషాల్లో తేడాల కారణంగా అక్కడి ప్రజలతో కలిసిపోయేందుకు శరణార్థులు చాలా ఇబ్బందులు పడుతుంటారు.

అబ్దుల్ సామద్‌కు మాత్రం ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇతని వద్ద ఉన్న చెస్ బోర్డు ఆయనకు ఎంతోమందిని స్నేహితులను తెచ్చి పెట్టింది.

దిల్లీ నడిబొడ్డున ఉన్న ప్రధాన మార్కెట్ ప్రాంతం కన్నాట్ ప్లేస్‌‌లో ఆయన రోజూ చెస్ ఆడుతూ గడుపుతుంటారు.

ఉదయం 11.00 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈయన చెస్ ఆడుతూనే ఉంటారు.

అక్కడ ఈయన ఒక్కరే కాకుండా.. ఆయన చుట్టూ గుంపుగా జనాలు కూడా కనిపిస్తారు.

సామద్‌తో ఆట ఆడేందుకు చాలా మంది ఎగబడుతుంటారు.

దిల్లీలోని భోగల్ ప్రాంతం నుంచి రోజూ ఉదయం 11 గంటలకు కన్నాట్ ప్లేస్‌కి వస్తారు. రాత్రి 9 దాటే వరకూ ఇక్కడే చెస్ ఆడుతానని సామద్ చెబుతున్నారు.

చెస్‌లో ఈయన్ను ఓడించడం చాలా కష్టమని ఆయనతో ఆడిన వారు అంటారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)