పిచ్చుకకూ ఓ స్మారక స్థూపం ఉంది.. ఎక్కడో తెలుసా?

  • 20 మార్చి 2018
పిచ్చుక స్మారకం Image copyright kalpit bhachech

'నవనిర్మాణ్ ఆందోళన్' పేరుతో 1974లో గుజరాత్‌ రాష్ట్రంలో ఓ పెద్ద ఉద్యమం జరిగింది.

ఆర్థిక సంక్షోభం, అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు చేపట్టిన సామాజిక రాజకీయ ఉద్యమం అది.

ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘర్షణల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.

అయితే, ఆనాటి పరిస్థితులను అహ్మదాబాద్ ప్రజలు ఓ వినూత్న పద్ధతిలో గుర్తు చేసుకుంటున్నారు.

పిచ్చుక స్మారకం Image copyright KALPIT BHACHECH
చిత్రం శీర్షిక 'నవనిర్మాణ్ ఆందోళన్'

అప్పుడు అహ్మదాబాద్ పాత బస్తీలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఊరపిచ్చుక చనిపోయిందట.

అది చూసి స్థానికులు చలించిపోయారు. దానికి జ్ఞాపకార్థంగా ఆ ఘటన జరిగిన చోటే ఓ స్మారక స్థూపాన్ని నిర్మించారు.

ఇప్పటికీ ఆ స్థూపం వద్ద ఆ పిచ్చుకను స్మరించుకుంటూ నివాళులర్పిస్తారు.

ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం.

పిచ్చుక స్మారకం Image copyright kalpit bhachech
చిత్రం శీర్షిక పిచ్చుక స్మారక స్థూపం

1974 మార్చి 2 సాయంత్రం 5.25 గంటలకు మేత కోసం వెతుకుతున్న ఆ పిచ్చుక పోలీసుల కాల్పుల్లో ప్రాణం కోల్పోయిందని ఆ స్థూపం మీద రాసి ఉంది.

పిచ్చుక Image copyright kalpit bhachech

పిచ్చుకలు అడవుల్లో కంటే జనావాసాల మధ్యన జీవించేందుకే ఇష్టపడతాయి.

అయితే, రెండు దశాబ్దాలుగా నగరాల్లో వీటి సంఖ్య భారీగా పడిపోయింది. కాంక్రీటు భవనాలు పెరిగిపోతున్నాయి. దాంతో ఈ పక్షులు గూళ్లు కట్టుకునేందుకు కూడా స్థలం దొరకట్లేదు.

పిచ్చుక ఆహారం Image copyright kalpit bhachech

అహ్మదాబాద్‌లో పిచ్చుకల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డబ్బాలలో గింజలు నింపి అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం స్థానికుల్లో స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.

ఫొటోలు: కల్పిత్ భచెచ్

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)