#BBCShe విశాఖ వస్తోంది!

#BBCShe విశాఖ వస్తోంది!

బిహార్ రాజధాని పట్నాలోని మగధ్ మహిళా కళాశాలలో #BBCShe బృందం అక్కడి మహిళలతో మాట్లాడింది. ఆ తరువాత 26న విశాఖపట్నం వస్తోంది. ఇంతకీ.. ఈ 'బీబీసీ షీ' ప్రాజెక్ట్ ఏంటి?

చాలా సింపుల్.. మహిళలు ఎలాంటి కథనాలను కోరుకుంటున్నారో చెబితే అవే వారికి చేర్చడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

సో... మీదే ఆలస్యం.. మీకెలాంటి కథనాలు కావాలో చెప్పండి. మీరేం కోరుకుంటున్నారో తెలపండి.

మీరు సూచించినవి బీబీసీ చేసి చూపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం!! మీ ఆలోచనలు మాతో పంచుకోండి.

ఇంతకీ పట్నా యువతులు ఏం చెప్పారో తెలుసా? మహిళల పట్ల వివక్ష, భ్రూణ హత్యలు, వరకట్న సమస్య, విద్యావకాశాల్లో వెనుకబాటుతనం వంటి చాలా చాలా అంశాలపై వారు తమ నిశ్చితాభిప్రాయాలను వెల్లడించారు.

మరి మీరూ #BBCShe బృందాన్ని విశాఖపట్నంలో కలుసుకోండి. వీలుకాకుంటే బీబీసీ తెలుగు ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల ద్వారా మీ అభిప్రాయాలను పంపించండి. #BBCShe హ్యాష్ ట్యాగ్ వాడడం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)