ఓ ట్రాన్స్‌జెండర్ డాన్సర్ కథ ఇది
ఓ ట్రాన్స్‌జెండర్ డాన్సర్ కథ ఇది
బాలుడిగా పుట్టి, నేడు మహిళగా జీవిస్తున్న అహ్మదాబాద్‌కి చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ డాన్సర్ కథ ఇది. తమకు అసలు మనుగడలోనే వివక్ష ఎదురవుతోందని లక్ష్మీ హేమంత్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తన కుటుంబమే తనను ఇంట్లోంచి గెంటేసిందని ఆమె ఎంతో బాధతో చెబుతున్నారు.
భరతనాట్యంపై ఎంతో ఆసక్తి ఉన్న లక్ష్మి, 12 ఏళ్ల వయసు నుంచే ఎన్నో అడ్డంకులను అధిగమించి దీనిని నేర్చుకున్నారు. తాను నేర్చుకున్న నాట్యాన్ని ప్రదర్శించడంలోనూ ఆమెకు అడ్డంకులు తప్పలేదు. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లక్ష్మి, కష్టాలకు ఎదురీదడంలో చదువే తనకు అండగా నిలిచిందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)