కేంద్రంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ నోటీస్!

  • 23 మార్చి 2018
ఖర్గే Image copyright TWITTER
చిత్రం శీర్షిక మల్లికార్జున ఖర్గే

లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. మార్చి 27న సభ చేపట్టే కార్యకలాపాల సూచీలో ఈ తీర్మానాన్ని చేర్చాల్సిందిగా కోరుతూ లోక్‌సభ కార్యదర్శికి లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ పార్టీలు ఇదివరకే అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ, సభలో ఆర్డర్ లేని కారణంగా వరుసగా సభా కార్యకలాపాలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.

ఖర్గే ఇచ్చిన నోటీస్‌లో "మంత్రిమండలిపై సభ అవిశ్వాసం ప్రకటిస్తోంది" అన్న ఏక వాక్య తీర్మానం ఉంది.

కాగా, శుక్రవారం నాడు ఉదయం స్పీకర్ సుమిత్రా మహాజన్ గందరగోళం నడుమ సభను వాయిదా వేశారు. ప్రధానంగా ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు చేపట్టిన నిరసనల మధ్య సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

దాంతో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై శుక్రవారం నాడు కూడా చర్చ జరగలేదు.

అవిశ్వాస తీర్మానాన్ని సభ చర్చకు చేపట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)