వైరల్: భార్య మీద అనుమానం వచ్చింది.. చెట్టుకు కట్టేసి కొట్టాడు

  • 24 మార్చి 2018
బులంద్‌షహర్, వీడియోలో భార్యను చెట్టుకు కట్టేసి కొడుతున్న భర్త Image copyright BBC/VIRAL VIDEO'S SCREENGRAB
చిత్రం శీర్షిక వీడియోలో భార్యను చెట్టుకు కట్టేసి కొడుతున్న భర్త

అక్కడ ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొడుతున్నారు. ఆమె బాధతో అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. కానీ గ్రామస్తులు మాత్రం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా లోంగా గ్రామంలో జరిగింది.

ఇంతకూ ఆ మహిళను కొట్టడానికి కారణం భర్తకు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడమే. అందుకే అతను అందరి ఎదుటా ఆమెను అంతలా కొట్టాడు.

మార్చి 10న జరిగిన ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

బాధితురాలు ఇంటినుంచి వెళ్లిపోయి వారం తర్వాత తిరిగి రాగా, కుటుంబ సభ్యులు ఆమెకు ఈ శిక్ష విధించారని బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పీ ప్రవీణ్ రంజన్ తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు బాధితురాలి భర్తతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Image copyright SUMIT SHARMA
చిత్రం శీర్షిక వీడియోలో చోద్యం చూస్తున్న వారందరిపై చర్యలకు ఆదేశించిన కలెక్టర్

ఈ విషయంపై గ్రామంలో పంచాయితీ కూడా నిర్వహించారని స్థానిక జర్నలిస్టు సుమీత్ శర్మ తెలిపారు.

అయితే ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు.

వీడియోను చూసిన జిల్లా కలెక్టర్ రోషన్ జాకోబ్ బాధిరాలిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. వీడియోలోని వ్యక్తులను గుర్తించి శిక్ష పడేట్లు చేస్తామని తెలిపారు.

ఈ సంఘటనపై డీఎమ్ స్థానికుల నుంచి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు బాధితురాలిదే తప్పని తెలిపారు.

జాతీయ నేర రికార్డుల బ్యూరో జాబితా ప్రకారం, మహిళలపై నేరాల విషయంలో 2015, 2016 లో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.

2015లో భర్త, అతని తరపు బంధువులపై 8,660 కేసులు నమోదు కాగా, 2016లో 11,166 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అక్కడ గ్రహాంతర జీవులున్నాయా.. ఎవరూ రావొద్దని అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఎందుకు హెచ్చరించింది

బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లోని ఫొటోల్లో నిజమెంత

ప్రెస్ రివ్యూ: మోదీది ఓ గెలుపా? ఏంపనిచేసి గెలిచారు? -కేసీఆర్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన ఐసీజే

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...