అనంతపురంలో అనాగరిక ఆచారం. బాలింతలు గ్రామంలో అడుగుపెట్టొద్దు

అనంతపురంలో అనాగరిక ఆచారం. బాలింతలు గ్రామంలో అడుగుపెట్టొద్దు

భారతదేశం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అయితే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశంలో ఎన్ని మార్పులొస్తున్నా.. నేటికీ ఎన్నో దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.

అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామంలో ఉన్న ఓ విచిత్రమైన ఆచారాలు అందుకు నిదర్శనం.

దాదాపు 120 నివాసాలు ఉన్న ఈ గ్రామంలో ఊరుగొల్ల, కాడుగొల్ల అనే రెండు కులాలున్నాయి. అందులో కాడుగొల్ల కులంలో ఉన్న అనాగరిక ఆచారాలు మహిళలను మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షోభకు గురిచేస్తున్నాయి.

ఈ ఊరిలో మహిళలు గుడికి వెళ్లకూడదు. అంతకంటే మరో దారుణం ఏంటంటే.. నెలసరి సమయంలో, ప్రసవించినప్పుడు దాదాపు 3 నెలలు ఊరిబయట పొలిమేరలో ఉండాలి.

7, 8 తరగతులు చదువుతున్న ఆడపిల్లలను కూడా ఆ ఐదు రోజులు ఊరిబయటే ఉంచుతారు. ఊరిలో అడుగుపెట్టకూడదు. ఆ ఐదు రోజులూ వాళ్లే వండుకోవాలి.

ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో బడి ఉంది. కానీ, నెలసరి సమయంలో బాలికలు ఊరిలోకి వెళ్లకూడదు కాబట్టి, చుట్టూ పొలిమేర మీదుగా 11 కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్లి రావాలి.

వాళ్లతో గ్రామస్థులెవరూ మాట్లాడకూడదు. ఒకవేళ వారితో ఎవరైనా మాట్లాడినా, తాకినా వాళ్లు కూడా ఊరిలోకి రాకూడదు.

కరెంటు ఉండదు. ఆ చీకట్లోనే గడపాలి.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)