ఈ ఏనుగు ‘స్మోకింగ్ ’ చేస్తుంది!

  • 28 మార్చి 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఈ ఏనుగు ‘స్మోకింగ్ ’ చేస్తుంది!

నోటి నుంచి ‘పొగ’ వదులుతున్న ఏనుగు వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణి నిపుణులకు పజిల్‌గా మారింది.

భారత వన్యప్రాణి సంరక్షణ సొసైటీకి చెందిన వినయ్ కుమార్ అనే శాస్త్రవేత్త కర్ణాటకలోని నగరోల్ అడవిలో 2016, ఏప్రిల్‌లో ఈ 48 సెకెండ్ల వీడియోను తన కెమెరాలో బంధించారు.

ఇప్పుడు దీన్ని బయటపెట్టారు. అది వైరల్ అయింది.

దాని ప్రాధాన్యత తెలీక ఇప్పటివరకు బయటపెట్టలేదని వినయ్ కుమార్ బీబీసీకి తెలిపారు.

అయితే శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఏనుగు ఇలా చేయడానికి కారణాలేంటో వివరించలేకపోతున్నారు.

బొగ్గులంటే ఏనుగుకు ఇష్టమా?

వినయ్ కుమార్, ఆయన టీమ్ కలిసి పులుల చిత్రాలను తీయడానికి అడవిలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లను పరిశీలించడానికి వెళుతుండగా, ఈ ఆడ ఏనుగు కంటబడింది.

ఆయనకు సుమారు 50 మీటర్ల దూరంలో ఈ 'స్మోకింగ్' చేస్తున్న ఏనుగు కనిపిస్తుంది.

ఏనుగు బహుశా బొగ్గును నోటిలోకి తీసుకుని, వాటిని మింగి, బూడిదను మాత్రం అలా బయటకు వదులుతోందని భావిస్తున్నారు.

ఈ వీడియోను పరిశీలించిన ఎలిఫెంట్ బయాలజిస్ట్ వరుణ్ ఆర్ గోస్వామి, ''బహుశా ఏనుగు ఆ బొగ్గును తినడానికి ప్రయత్నిస్తుందేమో'' అన్నారు.

బొగ్గులో ఉండే ఔషధ విలువల వల్ల ఏనుగు దాని పట్ల ఆకర్షితురాలై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు