కాంగోలో కోటి 30 లక్షల మందికి తక్షణ సాయం అందించాలన్న ఈయూ
కాంగోలో కోటి 30 లక్షల మందికి తక్షణ సాయం అందించాలన్న ఈయూ
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మానవీయ సంక్షోభం రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ఇక్కడున్న కోటి 30 లక్షల మందికి తక్షణ సాయం అందించాలని ఈయూ హెచ్చరిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ కబిల పాలనలో దేశమంతా అంతర్యుద్ధంలో మగ్గుతోంది.
దీనికి తోడు ప్రభుత్వ అవినీతితోపాటు అణచివేతా కొనసాగుతోంది. 2016తో పదవీకాలం ముగిసినా గద్దె దిగేందుకు జోసెఫ్ నిరాకరించడంతో ఉద్రిక్తత పరిస్థితులు మొదలయ్యాయి.
ఇతురి ప్రాంతంలో హింస తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా రెండు గ్రూపులు లెండు, హెమలు మారణ హోమాన్ని తలపిస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి కియానీ అందిస్తున్న ఈ కథనంలో హృదయాలు కలిచివేసే దృశ్యాలున్నాయి.
మా ఇతర కథనాలు చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)