‘జోలా చాప్స్’: దేశంలో లక్షల మంది రోగులకు వీరే ఆధారం

  • 30 మార్చి 2018
మహిళ

గ్రామాల్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఊళ్లో ఉండే సాధారణ వైద్యుల దగ్గరికి వెళ్తుంటారు. ఏనాడూ మెడికల్ కాలేజీకి వెళ్లకుండా.. ఎలాంటి అధికారిక గుర్తింపూ లేని ఇలాంటి వైద్యులను ‘జోలా చాప్స్’(బ్యాగ్ మ్యాన్) అంటారు.

దేశంలో అర్హతలున్న వైద్యులు సరిపడా లేని కారణంగా ప్రజలు జోలా చాప్స్‌ను ఆశ్రయిస్తారు. కానీ ఇలాంటి వాళ్లలో ఎక్కువమంది నకిలీ వైద్యులే ఉంటారనీ, వాళ్ల వల్ల రోగులకు ప్రమాదమనీ కొందరంటారు. కానీ ప్రేమ్ త్రిపాఠి అనే జోలా చాప్ మాత్రం ఆ మాటల్ని ఒప్పుకోరు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionలక్షలాది గ్రామీణులకు ఈ అర్హతలేని వైద్యులే ఆధారం

‘మేం ప్రాథమిక వైద్యం చేసి రోగిని కాపాడతాం. మా వల్ల రోగితో పాటు ప్రభుత్వానికీ, దేశానికీ కూడా మేలు జరుగుతుంది’ అని ఆయన అంటారు. ప్రేమ్ ఉత్తర్ ప్రదేశ్‌లో జోలా చాప్స్ యూనియన్ మొదలుపెట్టారు. ఓ నర్సింగ్ హోమ్‌లో పనిచేసేప్పుడు వైద్యం నేర్చుకున్నట్లు ప్రేమ్ చెబుతారు.

గుర్తింపు లేని తమలాంటి వైద్యులకు సరైన శిక్షణతో పాటు అధికారిక గుర్తింపునూ అందివ్వాలని ఆయన కోరుతున్నారు.

దేశ వ్యాప్తంగా పది లక్షలకుపైగా జోలా చాప్స్ ఉన్నారు.

దేశంలో దాదాపు 45శాతం మంది వైద్యులకు తగిన అర్హతలు లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)