కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ద‌ళితులు మిగిలిన వర్గాల వారిలా టీ స్టాల్ దగ్గ‌ర కూర్చుని అంద‌రితో స‌మానంగా టీ తాగే అవ‌కాశం ఉండేది కాదు. వారు ఓ ప‌క్క‌గా నిల్చుని, వాళ్ల కోసం విడిగా పెట్టిన గ్లాసుల్లోనే టీ తాగాలి.

ఎన్నో చ‌ట్టాలు, సంఘాలు, పోరాటాలు ఇలాంటి వివక్షలను పూర్తిగా మార్చ‌లేక‌పోయాయి. కానీ సాంకేతిక అభివృద్ధిలో భాగంగా వచ్చిన ‘డిస్పోజబుల్ గ్లాస్’ ఈ వివక్ష రూపం తగ్గటానికి కొంత సాయం చేస్తోంది.

రిపోర్టింగ్: బళ్ల సతీశ్, వీడియో: సంగీతం ప్రభాకర్, ఇలస్ట్రేషన్స్: పునీత్ కుమార్

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)