కోల్‌కతా: రెడ్‌లైట్ ఏరియాలో ఈ రంగుల హరివిల్లులెందుకు?

  • 31 మార్చి 2018
సోనాగాఛీ Image copyright EPA/PIYAL ADHIKARY

పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా నగరంలోని సోనాగాఛీ ప్రాంతాన్ని ట్రాన్స్‌జెండర్ కళాకారులు రంగుల హరివిల్లులుగా తీర్చిదిద్దుతున్నారు.

పై చిత్రంలో కనిపిస్తున్న ఇంట్లో సెక్స్ వర్కర్లు తమ కో-ఆపరేటివ్‌ సంస్థను నిర్వహిస్తారు. ఈ ఇంటి గోడలపై రంగురంగుల పెయింటింగ్ వేశారు.

కోల్‌కతా మహానగరం నడి మధ్యలో, ఇరుకిరుకు గల్లీలతో ఉండే సోనాగాఛీ ప్రాంతాన్ని ఆసియాలోనే అతి పెద్ద వ్యభిచార ప్రాంతంగా పరిగణిస్తారు. ఇది దాదాపు 11 వేల సెక్స్ వర్కర్లకు నెలవుగా ఉంది.

Image copyright EPA/PIYAL ADHIKARY

సెక్స్ వర్కర్ల హక్కుల కోసం, మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేయడం కోసం చైతన్యం తేవాల్సిన అవసరం ఉందంటూ ట్రాన్స్‌జెండర్ కళాకారులు ఇలా పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టారు. బెంగళూరుకు చెందిన ఓ ఆర్ట్ గ్రూపు వీరికి సహకారం అందించింది.

ఇళ్లపై పెయింటింగ్స్ వేయడానికి దాదాపు వారం రోజులు పట్టింది.

ఇక్కడున్న వేశ్యాగృహాల్లో అత్యధికం శిథిలావస్థలో ఉన్నాయి. చాలా చోట్ల వీటి గోడలు చుట్టపక్కల వారి గోడలతో కలిసిపోయాయి.

Image copyright EPA/PIYAL ADHIKARY
Image copyright EPA/PIYAL ADHIKARY
Image copyright EPA/PIYAL ADHIKARY
Image copyright EPA/PIYAL ADHIKARY

వేశ్యాగృహాల చుట్టుపక్కల ఉన్న ఇళ్ల గోడలపై కూడా పెయింటింగ్స్ వేశారు. ఇంకా ఈ ప్రాంతంలోని చాలా ఇళ్లపై ఇలాంటి పెయింటింగ్స్ వేయాలనే ఆలోచన ఉంది.

భారత్‌లో వేశ్యావృత్తి అనేది ఇప్పటికీ ఒక పెద్ద సమస్యగా ఉంది. దేశంలో రోజూ 30 లక్షల మంది సెక్స్ వర్కర్స్‌గా పని చేస్తుంటారని ఒక అంచనా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)