#CWG2018 పీవీ సింధు.. పతకం తెస్తుందా?

  • 4 ఏప్రిల్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionగ్లాస్గో కామన్ వెల్త్ గేమ్స్ లో సాధించలేనిది... గోల్డ్ కోస్ట్ గేమ్స్ లో సాధిస్తారా..?

మరికొద్ది నిమిషాల్లో గోల్డ్‌ కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ క్రీడాకారుల విజయావకాశాలపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

గ్లాస్గో కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయి ఉండవచ్చు. కానీ, ఈసారి గోల్డ్ కోస్ట్ గేమ్స్ లో మాత్రం అద్భుత విజయాలు సాధించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు భారతీయ అథ్లెట్లు.

షూటింగ్ విభాగంలో భారతీయ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించే అవకాశం ఉంది.

మను భకేర్, మేహూలి ఘోష్,లు ఈ మధ్య కాలంలో జరిగిన అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించారు.

"గత కామన్ వెల్త్ గేమ్స్ కన్నా ఈసారి షూటింగ్ లో భారత్ ఎక్కువ పతకాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే మన షూటర్లు అందరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ మధ్య జరిగిన వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో వారు అద్భుతంగా రాణించారు. పురుషులే కాదు మహిళల జట్టు కూడా బాగా ఆడాలనే తపనతో ముందుకు వెళ్తోంది. షూటింగ్ ఈవెంట్లలో కనీసం ఒక్క పతకమైనా భారత్ సాధిస్తుందని అనుకుంటున్నా" అని భారత షెఫ్-డి-మిషన్ (ఇంచార్జి) విక్రమ్ సిసోడియా అన్నారు.

Image copyright Commonwealth Games

ఇక భారత్ కు కచ్చితంగా పతకం వస్తుందనుకునే విభాగాలలో బాడ్మింటన్ ఒకటి.

వరల్డ్ నెంబర్-త్రీ పీవీ సింధు, సైనా నెహ్వాల్ బంగారు పతకం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

"దేశం మొత్తం బాడ్మింటన్ లో పతకం సాధిస్తామనే నమ్మకంతో ఉంది. పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషులలో శ్రీకాంత్ , ప్రణయ్ లకు పతకాలు సాధించే సత్తా ఉంది. డబుల్స్, మిక్సెడ్ డబుల్స్ ఈవెంట్లలో మన జట్లు చాలా బలంగా ఉన్నాయి" భారత షెఫ్-డి-మిషన్ (ఇంచార్జి) విక్రమ్ సిసోడియా విశ్లేషించారు.

Image copyright Getty Images

బాక్సింగ్ లో కూడా పతకం సాధించే సత్తా మన అథ్లెట్లలో ఉంది.

ముఖ్యంగా వికాస్ కృష్ణన్, మేరీ కోమ్, మనీష్ కౌశిక్ లు మంచి ఫామ్ లో ఉన్నారు.

భారత్ హాకీ టీం నుంచి స్టార్ ప్లేయర్లు సర్దార్ సింగ్, రమణ్ దీప్ సింగ్ లను తొలగించారు.

కొత్త కోచ్ ఆధ్వర్యంలో ఒక సమతూకం కలిగిన జట్టుకు మన్ ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తారు.

తమ మొదటి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను భారత్ ఢీకొంటుంది.

అయితే పసిడి పతకం కోసం జరిగే పోటీలో భారత్, ఆస్ట్రేలియా వంటి హేమాహేమీ జట్లను దాటి వెళ్లాల్సి ఉంటుంది.

Image copyright Getty Images

ఇక భారత్ రెస్లర్లు ఏప్రిల్ తొమ్మిది నాటికి గోల్డ్ కోస్ట్ చేరుకుంటారు.

ఈ పోటీలలో ఉన్న పన్నెండు పతకాలతో కనీసం ఏడింటిని గెలవడానికి భారత్ కుస్తీ వీరులు కసరత్తు చేస్తున్నారు.

సుశీల్ కుమార్, వినేష్ ఫోగట్, బబిత ఫోగట్, సాక్షి మాలిక్ లు భారత్ రెస్లర్ల కు నాయకత్వం వహిస్తారు.

అథ్లెటిక్స్ లో.. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా, హై జంపర్ అర్విందర్ సింగ్ ల పై కూడా భారత్ ఆశలు పెట్టుకుంది.

అయితే, కొంతమంది ఇతర అథ్లెట్లు కూడా పతకం సాధించే సత్తా ఉన్న వారే.

"నేను 2012 లో లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్నాను. ఆ పోటీలలో నేను పదో స్థానంలో నిలిచాను. అలాగే జాతీయ రికార్డు కూడా బద్దలుకొట్టాను. అదే టైమింగ్ ఇక్కడ కొనసాగిస్తే, సునాయాసంగా మెడల్ సాధించగలను" అని 20 కిమీ నడకలో పోటీ పడుతున్న ఇర్ఫాన్ సోడి అన్నారు.

లాంగ్ జంపర్ నైనా జేమ్స్ మాట్లాడుతూ "ఇవి నా మొదటి కామన్ వెల్త్ పోటీలు. ఇండియాకు పతకం సాధించాలనుకుంటున్నాను" అన్నారు.

29 హెక్టార్లలో కామన్ వెల్త్ గేమ్స్ విలేజ్ నిర్మించారు. ఇక్కడ 1257 ఫ్లాట్ లు ఉన్నాయి.

రాబోయే రెండు వారాలలో 6500 మంది అథ్లెట్లు ఇక్కడే ఉండబోతున్నారు.

గ్లాస్గో గేమ్స్ లో భారత్ పదిహేను గోల్డ్ మెడల్స్ సాధించి పతకాల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. ఈసారి ఎన్ని పతకాలు సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

‘అత్యాచారానికి గురయ్యాక నిద్రపోయాననటం.. భారత మహిళ తీరులా లేదు’: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు.. ఉపసంహరణ

చైనా వైద్య పరికరాలు భారత్‌లో ఓడల నుంచి దిగటం లేదు.. ఎందుకంటే...

చైనా, బ్రిటన్ మధ్య ‘హాంకాంగ్’ చిచ్చు... ప్రపంచ క్రమం మారిపోతుందా?

వెస్ట్‌ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఎందుకు కలుపుకుంటోంది?

సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు విజయం సాధించటం ఎలా?

కరోనావైరస్‌కు చైనా సంప్రదాయ వైద్యం.. ‘విజయవంతం’ అంటున్న చైనా

ప్రియాంకా గాంధీకి డెడ్‌లైన్.. 'లుటియన్స్ దిల్లీ' ఇల్లు ఖాళీ చేయాలన్న కేంద్రం

కోటిన్నర జీతం ఇచ్చే ఉద్యోగం వదులుకుని.. పోరు బాట పట్టిన మహిళా న్యాయవాది

PUBG గేమ్ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేసిన 17 ఏళ్ల కుర్రాడు