ప్రత్యేక హోదా డైరీ: రేపు ‘ఎంపీ పదవులకు రాజీనామా.. నిరవధిక నిరాహారదీక్ష’

వైసీపీ ఎంపీలు

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయే ఊపిరి అని జగన్ చెప్పారు. ఆ ఊపిరి కోసం మా ఊపిరి ఉన్నంతవరకూ పోరాటం చేస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చెప్పారు.

గురువారం ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు శుక్రవారం నాటితో ముగుస్తున్నందున, ప్రత్యేక హోదా డిమాండ్‌ నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తాము రాజీనామాలు చేస్తామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. పార్లమెంటు ముగిసిన వెంటనే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కు వెళ్లి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని వెల్లడించారు. తాము జీతాలు మాత్రమే కాదని ఎంపీ పదవులను కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డామన్నారు.

ఇదిలా ఉండగా.. ఏపీ భవన్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకుగాను అనుమతి ఇవ్వాలని వైసీపీ ఎంపీలు గతంలో కోరగా, గురువారం అధికారులు ఆ మేరకు అనుమతులిచ్చారు.

ఫొటో క్యాప్షన్,

ఆస్పత్రిలో అవంతి శ్రీనివాస్‌ను పరామర్శిస్తున్న టీడీపీ ఎంపీలు

పార్లమెంటులో టీడీపీ ఎంపీల దీక్ష.. బయటకు పంపిన మార్షల్స్

ప్రత్యేక హోదా సహా విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో నిరసన దీక్షకు దిగారు. అయితే, రాత్రి 8 గంటలకు మార్షల్స్ వారిని బయటకు తరలించారు. దీనిపై ఎంపీలు స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున పోరాడుతున్న తమను బయటవేయటం సరికాదని, ఇది ప్రజల్ని అవమానించినట్లేనని, శుక్రవారం నుంచి తమ ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని చెప్పారు. కాగా, దీక్ష చేస్తున్న సందర్భంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కళ్లుతిరిగి పడిపోవటంతో డాక్టర్లు ఆయన్ను పరీక్షించి, రామ్‌ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)