పెళ్లి ఫొటోలను పోర్న్ ఫొటోలుగా మార్చి.. వివాహితుల బ్లాక్ మెయిల్

ఫొటో సోర్స్, iStock
జీవితాంతం మధురానుభూతుల్ని పంచాల్సిన పెళ్లి ఫొటోలు కొందరు వివాహితలకు చేదు జ్ఞాపకాలను మిగులుస్తున్నాయి. కేరళలోని ఓ ఫొటో స్టూడియో నిర్వాహకులు తమ క్లయింట్ల ఫొటోలనే మార్ఫింగ్ చేసి వాటిని పోర్న్ ఫొటోలుగా మార్చారు.
అలా మార్చిన ఫొటోలతో వివాహితలను బ్లాక్ మెయిల్ చేశారు. ఈ ఉదంతంలో కేరళ పోలీసులు ఇద్దరు స్టూడియో యజమానులతో పాటు ఓ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.
తమ పెళ్లినాటి ఫొటోలను మార్ఫింగ్ ద్వారా నగ్న చిత్రాలుగా మార్చి తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కొందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు బీబీసీ ప్రతినిధి అష్రాఫ్ పడానాతో చెప్పారు.
తమ నకిలీ పోర్న్ ఫొటోలను నిందితులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు బాధిత మహిళలు ఆరోపించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉద్యోగి కోజికోడ్‌కు దగ్గర్లోని ఓ వెడ్డింగ్ ఫొటో స్టూడియో ఫొటో, వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. అతడిని అరెస్టు చేయాలని మహిళలు స్టూడియో బయట నిరసన ప్రదర్శన నిర్వహించడంతో ఈ ఉదంతంపై అందరి దృష్టీ పడింది.
ఫొటో సోర్స్, iStock
స్టూడియోలోని హార్డ్ డిస్క్‌లో మహిళలకు చెందిన దాదాపు 40వేల ఫొటోలున్నాయని, వాటిలో ఎన్నింటిని మార్ఫింగ్ చేశారో తెలీదని పోలీసులు చెప్పారు.
వీటిలో ఎన్ని ఫొటోలను ఆన్లైన్లో పెట్టారో, ఎన్నింటిని బహిర్గత పరిచారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులన్నారు.
పోర్న్ సైట్ అయిన పోర్న్ హబ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇటీవలి కాలంలో యూఎస్, యూకే, కెనడా తరవాత ఆ సైట్‌కి ఎక్కువ ట్రాఫిక్ భారత్ నుంచే వస్తోంది.
2015లో భారత ప్రభుత్వం వందలాది పోర్న్ సైట్లకు యాక్సెస్ నిరోధించింది. చిన్న పిల్లలు ఆ సైట్లలోకి వెళ్లకుండా ఉండేందుకే ఆ చర్యను తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తడంతో రెండు వారాల్లోనే వాటిని పునరుద్ధరించారు.
ఇవి కూడా చదవండి:
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- #CWG2018 పీవీ సింధు.. పతకం తెస్తుందా?
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- పోర్నోగ్రఫీ సమస్యకు పోలీసుల షాక్ థెరపీ
- కండోమ్ ప్రకటనలు - నాటి నుంచి నేటి వరకు!
- రివెంజ్ పోర్న్: అసభ్యకర చిత్రాలకు చెక్ పెట్టనున్న ఫేస్బుక్
- #UnseenLives: ఊళ్లలో కుల వివక్షను పేపర్ కప్ బద్దలుకొడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)