సల్మాన్ ఖా‌న్‌కు బెయిలు వస్తుందా, రాదా?.. తీర్పు రేపు

సల్మాన్ ఖాన్

ఫొటో సోర్స్, AFP

కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జోధ్‌పూర్ న్యాయస్థానంలో విచారణ జరిగింది. తీర్పు శనివారం వెలువడనుంది.

1998 సెప్టెంబర్ 26న 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ సమీపాన కంకనీ అనే గ్రామం వద్ద కృష్ణ జింకల వేటకు సంబంధించి 'భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం' కింద సల్మాన్‌పై కేసు నమోదైంది.

జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ను గురువారం దోషిగా ప్రకటించింది. ఆయనకు ఐదేళ్లు జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించింది. సల్మా‌న్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, జోధ్‌పూర్ కేంద్ర కారాగారానికి తరలించారు.

బిష్ణోయి వర్గానికి చెందిన కొందరు పెట్టిన కేసులో సల్మాన్ తొలిసారిగా 1998 అక్టోబర్‌లో అరెస్టయ్యారు. అయితే, వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. తర్వాత ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగింది. గురువారం తీర్పు వెలువడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)