టీడీపీ ఎంపీలూ రాజీనామా చేయాలి: చంద్రబాబుకు జగన్ సవాల్

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
వైఎస్ఆర్సీపీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు రాజీనామాలు స్పీకర్‌కు సమర్పించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తాము రాజీనామా చేసినట్టు వారు పేర్కొన్నారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), అవినాష్ రెడ్డి (కడప), మిథున్ రెడ్డి (రాజంపేట), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) - ఈ ఐదుగురూ కొద్ది సేపటి క్రితం లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా సమర్పించారు.
పునరాలోచించుకోండి: స్పీకర్
రాజీనామాలపై పునరాలోచించు కోవాలని లోక్‌సభ స్సీకర్ సుమిత్రా మహాజన్ వైఎస్ఆర్సీపీ సభ్యులకు సూచించారు.
సభలోనే ఉండి హోదా కోసం పోరాటం చేయవచ్చు కదా అని కూడా ఆమె వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించినట్టు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
అయితే తాము రాజీనామాలకే సిద్ధపడ్డామని వైఎస్ఆర్సీపీ లోక్‌సభ సభ్యులు అయిదుగురూ స్సీకర్‌కు సున్నితంగా తెలిపారని ఆయన వివరించారు.
"హోదా కోసం పోరాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నాం" అని వైఎస్ఆర్సీపీ లోక్‌సభ సభ్యులు తమ లేఖలో ప్రకటించారు.
ఫొటో సోర్స్, YSRCP
మీ వాళ్లతోనూ రాజీనామా చేయించండి: జగన్
రాజీనామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తాము చెప్పిందే చేస్తామని అంటూ, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
"మేం చెప్పిందే చేస్తాం! వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈరోజు రాజీనామా చేస్తున్నారు. టీడీపీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని నేను చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా" అని జగన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)