ప్రత్యేక హోదా డైరీ: వైసీపీ ఎంపీల రాజీనామా, పవన్ పాదయాత్ర..చంద్రబాబు సైకిల్ యాత్ర

  • 6 ఏప్రిల్ 2018
Image copyright YsAvinashYouth/Facebook

వైసీపీ ఎంపీల రాజీనామా

ముందే ప్రకటించినట్లుగా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌‌కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.

అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు.

Image copyright YSRCP

లోక్‌సభ నిరవధిక వాయిదా

ఆంద్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేస్తోందని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభలో చివరిరోజు కూడా చర్చ జరగలేదు.

ఎలాంటి చర్చ చేపట్టకుండానే సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.

Image copyright TDPP

టీడీపీ ఎంపీల నిరసన

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయంలో నిరసన తెలిపారు.

మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లారు.

దీంతో ఎంపీలు పార్లమెంట్‌ గేట్‌ నంబర్‌ -1 వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సైకిల్ యాత్ర చేశారు.

విభజన హామీల అమలులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

Image copyright janasenaparty/Facebook

పవన్‌కల్యాణ్‌ పాదయాత్ర

ప్రత్యేక హోదా సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మకద్రోహం చేశాయంటూ జనసేన, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, పాదయాత్రలు జరిగాయి.

విజయవాడ‌లోని బెంజ్ సర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు సాగిన పాదయాత్రలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ పాల్గొన్నారు.

టీడీపీ కొన్ని ఒత్తిళ్లకు లొంగి ప్రత్యేక హోదా కోసం పోరాడలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి వెళ్లబోమని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలక్టు కమిటీ ఏం చేస్తుంది

బెజోస్ ఫోన్ హ్యాకింగ్: అమెజాన్ బిలియనీర్ ఫోన్‌ని సౌదీ యువరాజు హ్యాక్ చేశారా?

రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తులు: 2013 నుంచి ఎన్ని ఆమోదించారు.. ఎన్ని తిరస్కరించారు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్.. ఇది ఎలా పనిచేస్తుంది

రాజధాని రగడ-రాజకీయ క్రీడ : ఎడిటర్స్ కామెంట్

ప్రెస్ రివ్యూ: కక్షతో మేనమామ ఇంట్లో పెట్రోలు పోసి నిప్పుపెట్టిన వ్యక్తి.. ముగ్గురి మృతి

సాయిబాబా ఎక్కడ జన్మించారు... షిర్డీలోనా... పత్రిలోనా

పల్లేడియం: ఈ లోహం ధర బంగారాన్ని దాటేసింది.. ఎందుకు

చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఆరుగురి మృతి