BreakingNews: వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం

  • 8 ఏప్రిల్ 2018
బ్రేకింగ్ న్యూస్

ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో వికాస్ థాకూర్ కాంస్యం సాధించాడు.

పురుషుల 94 కేజీల విభాగంలో ఇతను మూడో స్థానంలో నిలిచాడు.

ఈ 24 ఏళ్ల లూధియానా కుర్రాడు స్నాచ్‌లో 159 కిలోల బరువు ఎత్తాడు.

తర్వాత క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 192 కిలోల బరువు ఎత్తాడు.

దీంతో భారత్ పతకాల సంఖ్య 11కి చేరింది.

ఈ విభాగంలో కెనడాకు చెందిన బోడీ సాన్టావీ బంగారు పతకం సాధించాడు.

ఒక్క ఆదివారమే రెండు స్వర్ణాలు.. ఒక రజతం.. రెండు కాంస్య పతకాలు భారత్‌ క్రీడాకారులు సాధించారు.

16 ఏళ్ల బాలిక అయిన మనూ బకర్ 10 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో స్వర్ణం సాధించింది. ఇదే ఈవెంట్‌లో హీనా సిద్ధూ రజతం సాధించారు.

అంతకు ముందు మహిళల 69కిలోల విభాగంలో పూనం యాదవ్ స్వర్ణం సాధించారు.

పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రవికుమార్ కాంస్య పతకం సాధించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)