కామన్వెల్త్ క్రీడల్లో నేడు: భారత్‌‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం

  • 9 ఏప్రిల్ 2018
Image copyright Getty Images
చిత్రం శీర్షిక మెహులి ఘోష్ (కుడి), అపూర్వి ఛండీలా (ఎడమ)

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో సోమవారం ఉదయం భారత్‌కు నాలుగు పతకాలు లభించాయి.

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులి ఘోష్ రజత పతకం సాధించగా.. అపూర్వి ఛండీలా కాంస్య పతకం పొందింది.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతు రాయ్ స్వర్ణ పతకం సాధించాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక షూటింగ్‌లో స్వర్ణం సాధించిన జీతూ రాయ్

కాగా, వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్ జోరు సోమవారం కూడా కొనసాగింది.

105 కిలోల విభాగంలో ప్రదీప్ కుమార్ రజత పతకం సాధించాడు. దీంతో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 8కి చేరింది.

Image copyright Twitter-IOA
చిత్రం శీర్షిక వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం సాధించిన ప్రదీప్ కుమార్

ప్రదీప్ కుమార్ స్నాచ్ అండ్ లిఫ్ట్‌లో 152 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 200 కిలోల బరువు ఎత్తాడు. మొత్తం 352 కిలోలు బరువు ఎత్తిన ప్రదీప్ ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం పొందాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు